కోపం : - అచ్యుతునిరాజ్యశ్రీ
 

తన కోపమే తన శత్రువు,తన శాంతమే తనకు రక్ష అని మనందరికీ తెలుసు.ప్రాణహాని చేస్తుంది.కోపం,అసూయ, ద్వేషం వలన మొహం ముడతలు పడటం,గుండె పోటు రావచ్చు.న్యూయార్క్ లో ఓ రెస్టారెంట్ ఓనర్ కి,పనివాడు" సాసర్ తో కాఫీ తాగండి" అనడం ఆలస్యం ,అతన్ని పిస్టల్ తో కాల్చబోయి,కోపంతో గుండె ఆగి చనిపోయాడు.ద్వేషం అసూయతో అకారణకోపం వల్ల గుండెజబ్బులు వస్తాయి.కోపం మనకే అపకారం చేసి మనల్ని దహించివేస్తుంది.  మనశత్రువుకి లాభం చేకూరుస్తుంది. ఇది షేక్స్పియర్ చెప్పిన మాట!ఇక కోపం వస్తే తమాయించుకుని ఎలా అవతలివారిని మనం ప్రసన్నులం చేసుకోవచ్చో రోనా అనే వ్యక్తి మాటల్లో తెల్సుకుందాం! "నేను వియన్నా వాసిని! రెండోప్రపంచయుద్ధసమయంలో స్వీడన్ వెళ్లాను ఉద్యోగం కోసం! కానీ నాకు స్వీడిష్ భాష బాగారాదని ఎక్కడా జాబ్ ఇవ్వలేదు.నాకు బాగా కోపం దుఃఖం వచ్చి అక్కసుతో ఓలేఖ రాశాను ఒకపెద్దకంపెనీకి! కానీ పోస్ట్ చేయకుండా ఆలోచన చేశాను."నేను స్వీడిష్ భాష నేర్చుకున్నాను.కానీ  ఉద్యోగం అప్లికేషన్ లో తప్పులు రాశాను కాబట్టే ఎవరూ నాకు జాబ్ ఇవ్వటం లేదు.కష్టపడి ఆభాషను నేర్చుకుంటా" అని నిశ్చయించుకున్నాడు."నారాతలో దోషాలున్నాయి. మీవల్ల నాకు లాభమే కలిగింది.మీకు థాంక్స్" అని రాసి పోస్ట్ చేశాడు.ఆశ్చర్యం! ఓపెద్ద కంపెనీ వెంటనే జాబ్ లో చేరమని ఆహ్వానించింది.అంతకు ముందు ఆకంపెనీ "నీవు మాకు తగిన ఉద్యోగివి కావు" అని నిరాకరించింది.అమెరికన్ ప్రెసిడెంట్ ఐసన్ హోవర్ ని ఎవరో అడిగారు" మీకు కోపం రాదా?" అని!"నాకు అంతటా ఉండదు.ఇష్టంలేని వారిని గూర్చి ఒక్క నిముషంకూడా ఆలోచించను" అని జవాబిచ్చాడు ఆయన! అందుకే ఎవరితో విరోధం పెట్టుకోకుండా, మాట తూలకుండా, మన పని మనం చేసుకుపోవాలి. ఆరోగ్యం ఉల్లాసంగా ఉండాలంటే మనకు బాగా నచ్చినవారితో కాసేపు మాట్లాడితే చాలు.అందరితో కబుర్లతో లేనిపోని తగాదాలవల్ల మనం బదనాం అవుతాం. 🌹
కామెంట్‌లు