అక్టోబర్ నెల మెంటర్ హెల్త్ వారోత్సవాలను ప్రభుత్వం పిల్లల మానసిక అభివృద్ధి నిమిత్తం అక్టోబర్ ఒక్కటి నుంచి 31 వరకు అన్నీ పాఠశాలల్లో నిర్వహించమని ఆదేశించిన నేపథ్యంలో తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలంలోని భాకరాపేట ఉన్నత పాఠశాలలో
ప్రముఖ రచయిత్రి తెలుగు ఉపన్యాసకురాలు డా.ధనాశి ఉషారాణి కార్యక్రమం నిర్వహించినారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన యస్. ఐ పోలీస్ అధికారి శ్రీ కృష్ణయ్య గారు ప్రిన్సిపాల్ శ్రీ.శివకుమార్ యమ్ ఈ ఓ గోపీనాథ్ గారు కార్యక్రమం లో పాల్గొని పిల్లలు ఉన్నత పౌరులుగా నైతిక విలువలను కలిగి సమాజానికి మంచి చేసేవారిగా నిలవాలని కోరారు.డ్రగ్స్ కి దూరముగా మానసిక వికాసాన్ని దృఢముగా ఉంచుకోవాలని సూసైడ్ లాంటి వాటికి దురముగా వుండాలనీ కోరారు.అనంతరం ప్రముఖ సేవకురాలు నిర్వహకురాలు డా.ధనాశి ఉషారాణి పిల్లలకు బహుమతులు అందజేశారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి