ఇది యాపారం!: - కొత్త విరిత


 ఆరోగ్యంగా ఉండాలంటే పొద్దున్నే ఫలానా జ్యూస్ తాగాలట… రక్తం పెరుగుతుందట! ఫలానా బ్రాండ్ ఖర్జూరం తింటే బీపీ పెరగదట! వీట్‌గ్రాస్ జ్యూస్ తాగితే హార్ట్‌ఎటాక్ రాదట! ఇంకో పొడి కలిపి తాగితే ఒంట్లో రోగాలన్నీ మాయమైపోతాయట! ప్రకటనలు చూస్తుంటే ఆరోగ్యం ఆసుపత్రిలో కాదు, అంగడిలో దొరుకుతున్నట్టుంది! ఇది తింటే అదొస్తాది… అది తాగితే ఇంకోటొస్తాది! ఏది తిన్నా ఏదో ఒక జబ్బు వస్తుందనే భయం మాత్రం ఉచితం! ఒకరు రక్తం పెంచుతామంటారు, మరొకరు రోగనిరోధక శక్తి పెంచుతామంటారు. ఇంకొకరు గుండెకు రక్షణ అంటారు… అసలు వైద్యశాస్త్రమే వాళ్ల ప్యాకెట్లలో ఉన్నట్టుంటుంది! మనిషి భయాన్ని గుర్తించడం ఒక కళ… ఆ భయాన్ని అమ్ముకోవడం ఒక వ్యాపారం! ఆరోగ్యం మీద ఆశ చూపించి, జబ్బుల మీద భయం పెంచి,చివరికి జేబులకు చిల్లులు పెట్టడం వీళ్ల వ్యాపార సూత్రం! వాళ్లు చెప్పినవన్నీ కొంటే ఆరోగ్యం వస్తుందో లేదో తెలియదు కానీ, ఖర్చులు మాత్రం ఖచ్చితంగా పెరుగుతాయి,షాపువాడికి మాత్రం బిజినెస్ వస్తుంది! 
మన ఆరోగ్యం ఎలా ఉన్నా, వాళ్ల "అమ్మకాలు మాత్రం ఆరోగ్యంగానే" ఉంటాయి! 
ఇదంతా ఆరోగ్యమో, ఆందోళనో తెలియదు కానీ… షాపు వాడికి మాంచి యాపారమే కదా!
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Super
Popular posts
ఈ కబుర్ల పేరేంటో?: అనురాధ బొడ్ల (సముద్రాల)-9989566696
చిత్రం
ఏది డ్యూటీ? : -అనురాధ బొడ్ల (సముద్రాల)-9989566696
చిత్రం
తప్పూ మంచిదేనేమో!: - అనురాధ బొడ్ల (సముద్రాల)-9989566696
చిత్రం
సుమతీ శతకం ౪౫(45)వ పద్యం. తల మాసిన నొలు మాసిన ఒలువలు మాసినను బ్రాణ వల్లభునైనన్ గులకాంతలైన రోఁతురు దిలకింపఁగ భూమిలోన దిరముగ సుమతీ! తా : ఓ మంచి తెలివి గల బుద్ధిమంతుడవైన, సుమతీ .... ఈ ప్రపపంచంలో, భర్త ఎంత అందగాడు ఐనా, తైల సంస్కారం లేని జుత్తుతో, శుభ్రం చేసుకోని దేహంతో, మాసిపోయి, దుర్గంధం వెదజల్లతున్న వస్త్రాలతో వుంటే కులస్త్రీలు కూడా ఆతనిని చూడటానికి ఇష్టపడరు. ఇది నిజంగా నిజము............. ....అని సుమతీ శతకకారుని వాక్కు. *ఈ పాంచ భౌతికమైన ప్రపంచంలో, నిత్యము, సత్యము ఐన ఆత్మ సౌందర్యం కంటే అనిత్యము, అసత్యము ఐన బాహ్య సౌందర్యానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడుతోంది.* *కానీ ప్రతి ఒక్కరూ, తమలోనే వున్న నేనుతో పరిచయం చెసుకుని, పెంచుకుని, పరమాత్ముని తో స్నేహం చేస్తూ ప్రయాణం చేయాలని భావం.* ....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం
ఆదర్శ ఉపాధ్యాయుడు: శరణ్య. నేను 8వ తరగతి . .ఎడపల్లి, నిజామాబాద్ జిల్లా.
చిత్రం