చేతిలో నోటు ఉంటే వేస్తా ఓటు! అనే రోజులు మారాయి
పెట్టించుకోకు చెవిలో పువ్వు
అన్యాయ అక్రమాలపై రాళ్లు రువ్వు
గానా బజానా చుక్క ముక్కకు ఇవ్వకు చోటు
స్కాంబాబులకు, గో.పి.లకు వెయ్యి తిరస్కారపు ఓటు
కుంభకోణాల భూకబ్జా బకాసురులు మురిపిస్తారు
ప్రలోభాలకు లొంగకు, పక్కదారులు పట్టకు
కుళ్లు కంపు లోకి యువత చొచ్చుకొచ్చి బడాబాబుల వీపు సాఫ్ చేయి
అవినీతికి అడ్డువేయి!
దక్కుతుంది జయం నీకోయి!
ఈనాడు నీదిరా! ఓటింగ్ నాడు
చొరబాట్లకు అడ్డుకట్ట వేయుమురా!
మీడియా మనముందుండగా
అభ్యర్థుల ఘనచరితలు తవ్వితీయరా!
అణగద్రొక్కు అరాచక అత్యాచారాలని
దేశాన్ని పట్టి పల్లార్చే కిరాతకుల్ని
యువతకు పట్టంకట్టు
దేశ భవితకు కావాలి తొలిమెట్టు🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి