గోండు బెబ్బులి కొమరం భీం : - అయ్యలసోమయాజుల ప్రసాద్ -(పుష్యమి)-సెయింట్ లూయిస్ -అమెరికా.


తమకంటు ప్రత్యేక రాజ్యం కావాలని 
అడవితల్లి మా మనుగడకు ఆధారమని 
ఇంకెన్నాళ్ళు మీ దోపిడి తనమని 
ఆదిలాబాద్ 
గోండు గూడెం లో  జన్మించి 
పోడు భూముల్లో పెరిగి
చదువురాక పోవడం పోరాటానికి అడ్డుకాదని
నైజాం పాలకుల దోపిడి తనానికి వ్యతిరేకంగా
మనుగడకాదరమైన అడవి తల్లిని 
కాపాడుటకు
స్వయం ప్రతిపత్తి కొరకు 
నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా 
బెబ్బులి వోలె పోరాడి 
జల్ జంగిల్ జమీన్ నినాదంతో గిరిజనులకు ప్రేరణగా నిలిచి
విల్లంబులుతో తుపాకులతో యుద్ధం చేసి 
జోడేఘాట్ కొండల్లో స్వతంత్ర రాజ్యం ఏర్పరిచి 
అమరుడవై అడవి ప్రజల హృదయాలలో
ఆరాధ్యదేవతగా నిలిచిన
కొమరం భీం 
మీరు సదా స్మరణీయులే 
మీ మొక్కవోని ధైర్య సాహసాలు 
నేటి యువతకు ప్రేరణయే 
అందుకోండి మీకివే నా అక్షరాంజలులు...!!
.........................

కామెంట్‌లు