పాషాణానికి రూపం రావాలంటే ఉలి దెబ్బలు తప్పవు!
కవిత్వానికి జీవం రావాలంటే కలం పోట్లు తప్పవు!
రూపం వచ్చిన పాషాణం దైవత్వమొంది గుడిలో వేదమంత్రాలతో దర్శనమిస్తుంది!
జీవం వచ్చిన కవిత వాగ్దేవి వీణానాదంలా అందరినీ అలరిస్తుంది!
పాషాణం దైవంగా రూపమొంది వింటున్నాడు విన్నపాలు!
అక్షరాలు కవిత్వంగా రూపమొంది అందుకుంటున్నాయి సన్మానాలు!
కవితకు నీరాజనం ప్రోత్సాహాకాలు!
దైవానికి నీరాజనం బ్రహ్మోత్సవాలు!
కవితనైనా దేవుని విగ్రహమునైనా లిఖించేది మలచేది మనిషే!
ఓ మనిషీ! నువ్వు మహామనీషి!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి