సామెత -389 :ఈ సంబడానికేనా ఇంత ఆర్భాటం
**
"ఓష్నీ యవ్వా! కొంతమందిరేందురుల్లా బలే గమ్మతి శేత్తుంటరు? గాల్ల శెకలు సూత్తె శిత్రమైన మడుసులు శిత్రమైన శేట్టలు అనిపిత్తుంది. గాల్ల ముచ్చెటి తల్సుకుంటుంటెనే నవ్వాగది? గదేదో శాత్రం సుత యాదికత్తది.
"ఏంది శెల్లె గంత నవ్వొచ్చే యిష్యం ? గదేందో నాకు సుత శెప్పరాదు. యిని నవ్వుకుంట."
"గదేనవ్వా! మన పండరి మావఁ ముచ్చెటినే. ఎప్పుడు సూశినా ఎవలో ఎనకనుంచి ఉరికిత్తున్నట్టు శేత్తడు సూడు. "ఏంది పెద్దాయనా! గట్ల ఉర్కులు బెట్టవడ్తివని ఎవలన్న అంటే " ఎల్లుండి మా యింట్లె లగ్గం గందుకే గీ ఉర్కులు" అన్నట్టుంటది మన మావఁ కత.
"ఓషోష్! శెల్లే గా మావఁ ముచ్చెటినేనా! గాయిన్ని సూత్తె పాద్రసం లెక్క అగుపిత్తడు .యాడన్న ఒక్క శనం నిల్కడగ వుండంగ సూశినమా శెప్పు? ఎవలింట్ల పంచెనైనా గా మావేఁ అగుపిత్తడు.సూశేటోళ్ళకి గాయినింట్ల కార్యమట్టుంది అన్పిత్తది. మస్తు అడావిడి మడిషిలే."
"అవునవ్వా! గసుమంటి మడిషిని ఏడ సూడలేదవ్వా! నిన్న గాల్లింట్ల పంచనికి బొయ్యిన గద. నువ్వేమో సకినం బట్టుకున్నట్టు మొన్నే సుట్టాలింట్లె పంచననుకుంట ఎల్తివి."
" అవును శెల్లే! గీ రొండు దినాలల్ల గంత యిచ్చింత్రం ఏం జర్గింది? "
" గదే రొండు దినాల్దాక ఎందుకు అవ్వా! రొండు మూడు గంటల్లనే శిత్రాలు జర్గొచ్చు. మా యిచ్చింత్రం అని సుత అనిపించొచ్చు."
"అవునా శెల్లే?నూ ఊరిచ్చుకుంట శెప్తుంటే ఎప్పుడెప్పుడాని మన్సు ఆగట్లేదంటె నమ్ము."
" ఊల్లె మనాడ కట్టోళ్ళు అందర్ని పిల్శి అయితారం మద్దేనం బోయినాలు వెట్టిండు.ఇంగ సూస్కో వొచ్చినోళ్ళల్ల శానా మందిరి శెవులు కొరుక్కో వట్టిర్రు. ఎందుకయ్యుంటదని. "
" నేను సుత ఉగ్గవట్టి సూత్తున్న .యిందామన్నది ఎప్పుడెప్పుడు యిందామా అని సూత్తున్న.వొడ్డున వడ్డ శేప పిల్ల లెక్క మన్సు గా యిష్యం మీదనే కొట్టుకుంటుంది శెల్లే?"
" అయితే ! యిను మరి. అప్పటికప్పుడే సుట్టాల్ని ,అటీటూ యిండ్లల్లోల్లని పిలిశిర్రు. బోయినాలు తిని తుత్తిగ వూపిరి వీల్సుకుంటూ గా మావఁ మొకాన్నే సూడవట్టినం."
" అయితే అస్లిష్యం శెప్పిండన్న మాట"
"ఏం శెప్పుడో అవ్వా! ఇన్నంక పొట్ట శెక్కలయ్యే దన్క నవ్వినం! ''
"అవునా శెల్లే! శెప్పు. శెప్పు ఊరీలియ్యకి."
"గా మావఁ మన్వడికి మూడేండ్ల దన్క మాటలు రాలే. గట్లని శెవుడా అంటే గాదు.మొదట్ల గదేదో సైన్మాల శీలచ్మి లెక్క 'అబ్బ దబ్బ జెబ్బ' అనేటోడు. ఓ దినం "అవ్వోవ్ ఆకలే" అన్నడంట. ఇంగేముంది ముర్సి ముక్కలై అన్నదానమే శేసిండు యాదికొచ్చిందా?"
అవును శెల్లోవ్! గా బుడ్డోడు శానా పెద్దగనే అయ్యిండు గద. మల్ల గిప్పుడు గాని ముచ్చెటి ఎందుకొచ్చింది?"
" అగ్గో అవ్వా! గప్పటి బుడ్డోడు.ఇంకా బుడ్డోడి లెక్కనే ఉంటడా ఏంది? గాడు పెర్గి బల్లెకి వోతనే వుండె.గాని శిన్నప్పుడు మాటలు రాట్లేదని రంది వడ్డరు.గీ నడ్మల నేమో సద్వు సరింగ రాట్లేదని బాద వడవట్టిర్రు."
" గానికి సద్వు రాట్లేదని రందివడ్డోల్ల ముచ్చెటి యింటే బాద వడాలె గని నువ్వేంది నవ్వొత్తదని అన్నవ్?"
" ముందగాల యినవ్వా! గా పోరడికి గీ నడ్మల అన్నిట్ల వొందకి ఎనబైలు,తొంబైలు వొత్తున్నయంట.మన్వడికి బుద్ధునికి గ్యానోదయం అయినట్టు అయ్యింది సద్వుల వడ్డడని సంబురంగ నిన్న మా అందర్నీ పిల్శి పండరి మావఁ బోయినాలు వెట్టిండు."
" అయితే! గా పోరడు మంచి తొవ్వల బడ్డడన్న మాట."
" ఏం తొవ్వల బడుడు అవ్వా! గా బోయినాలకి మాకు లెక్కనే గానికి సద్వు శెప్పే సార్లకి ముందుగాల యిష్యమేం శెప్పకుండ పిల్శిండు.గాల్లు సుత వొచ్చిర్రు ."
" బోయినాలు అయినంక గా సార్లు ఎల్తు బోయినాల ముచ్చెటి ఏందో శెప్పుమంటే మావఁ అస్లిష్యం శెప్పిండంట. ఇంగ సూస్కో సార్లు ఒగలి మొకాలు ఒగలు సూస్కుంట గా మార్కుల కారటు తెమ్మర్రట.గందుల్ల ఏడు పక్కన సున్న, ఎనిమిది, తొమ్మిది పక్కన సున్నాలు వెట్టి తాతకి గొప్పగ సూపిచ్చిండు. గీ తాత ఏకంగ పంచనే శేసిండన్న మాట."
" ఈ సంబడానికేనా ఇంత ఆర్భాటం " సడేలే సరిపోయింది. గాడు నిజ్జంగా గంత కట్టపడ్తుండా అన్కున్న".
"అవునవ్వా! గింతలేడు గాడు తాతని మోసం చేసిండని సార్లు శెప్పే తల్కి గాల్లని ఆడనే వుండుర్రని శెప్పి ఇంటెన్క కెల్లి శింత బరిగె వట్కొచ్చి వాన్కి నాల్గు అంటిచ్చిండు. ఇంగ జూస్కో గాడు లబ్బ లబ్బ మొత్తుకొనుడు.అందరు ఒక్క తీర్గ నవ్వుడే నవ్వుడు."
"గదండీ సంగతి! " ఈ సంబడానికేనా యింత ఆర్వాటం". అంటే శిన్న యిష్యానికే పెద్దగ సంబుర పడ్తుంటరు కొందరు .లోతులకెల్లి తెల్సుకోక పైపైన్నే సూత్తరు.గిట్ల శేత్తరా ఎవలైనా? గందుకేనేమో మన పెద్దోళ్ళు గీ సామెత సుట్టించిర్రు. మన ఎన్కటి తరమోళ్ళ తెల్వే తెల్వి గదురుల్లా!"

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి