జీవితం ఒక అద్భుతం. మనం అనుకున్నవేవీ అనుకున్నట్లుగా జరగవు. కానీ ఊహించని ఎన్నో సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఈ విశ్వంలో మనకు అతీతమైన ఓ శక్తి ఉంది.
దీపం వెలిగించినవారు చీకటిలో నడవరు. మంచి చేసేవారు జీవితంలో ఓడిపోరు.
జీవితంలో ఎవరూ ఏ బాధ నుంచి అయినా పూర్తిగా బయటపడలేరు. ఏదో ఒకలా ఎదుర్కొంటూ ముందుకు సాగుతుంటాం, అంతే!
తెలుసుకున్నాను అనడం కన్నా, జీవితంపై స్పష్టత వచ్చింది అనడమే నిజమైన అనుభవానికి అర్థం.
మన కళ్లముందు ఉన్న బాధ్యతల న్నింటినీ ఒకసారి గుర్తు చేసుకోవాలి. వాటిలో దేనిని ముందుగా పూర్తి చేస్తే మనసుకు సంతృప్తి కలుగుతుందో ఆలోచించి, దానిని ముందుగా చేయాలి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి