మన తమిళుల ఆరాధ్య దైవం సుబ్రహ్మణ్యస్వామి. ఈ స్వామి కోసం ఓ ఆంగ్ల మహిళ నిర్మించిన ఆలయం గురించి ఓ రెండు మాటలు. సుబ్రహ్మణ్యస్వామిని తమిళంలో మురుగన్ అని అంటారు. సుబ్రహ్మణ్య స్వామి ప్రపంచమంతటికీ చెందిన దైవమే అయినా, తమిళ ప్రజలకు మాత్రం ఆయన ఎంతో ఇష్టమైన దేవుడు. అందుకే ఆయన్ని తమిళ దైవం, తమిళ మురుగన్ అని ఎంతో ప్రేమగా పిలుస్తారు.
ఆయనపై కొందరు ఆంగ్లేయులకు కూడా అపారమైన భక్తి ఉంది.
1936లో ఓ యూరప్ మహిళ కొడైకెనాల్లో నిర్మించిన ఆలయమే కురింజి ఆండవర్ ఆలయం.
కొండలు, కొండల చుట్టూ ఉండే ప్రాంతాన్ని తమిళంలో కురింజి నేల అంటారు. కొండపై ఈ ఆలయం ఉండటంతో దీనికి కురింజి ఆండవర్ ఆలయం అనే పేరు వచ్చింది.
హిందూ మతంపై ఉన్న ఆసక్తితో ఆ మహిళ తన పేరును లీలావతి అని మార్చుకున్నారు. రామనాథన్ అనే తమిళ వ్యక్తిని వివాహం చేసు కున్నారు. మురుగన్ స్వామిపై ఉన్న భక్తితోనే ఆమె ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు.
ఈ ఆలయంలో అందాల దేవుడైన మురుగన్ స్వామి ఎంతో దివ్యంగా, గంభీరంగా దర్శనమిస్తారు.
ఈ ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. పన్నెండేళ్లకు ఒకసారి మాత్రమే పూసే కురింజి పూలు ఇక్కడ విరబూస్తాయి. 1994, 2006, 2018 సంవత్సరాల్లో ఈ పూలు పూశాయి.
భాష, దేశం వేరైనా భక్తికి హద్దులు లేవని చాటిచెప్పే ఈ ఆలయం నిజంగా ఎంతో ప్రత్యేకమైనది!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి