మంచి మార్పు ప్రగతికి సోపానం : - ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్ (పుష్యమి) - సెయింట్ లూయిస్-అమెరికా

 

ప్రకృతిలో మార్పు అన్నది సహజం 
మానవుని జీవితంలో బాల్య యవ్వన కౌమార వార్ధక్యాలు 
ఋతువులలోను ప్రకృతిలో మార్పు 
కాలాలలో 
వేసవి, వాన, చలికాలాలు 
అలాగే పరిణామ క్రమంలో జీవరాశి మార్పులు .

శాస్త్ర సాంకేతిక రంగాలలో విప్లవాత్మకమైన మార్పు   
విద్య వైద్యం రక్షణ రంగాలలో పరిశోధన 
సముద్ర గర్భం లో.  రోదసి యానం లో 
పురుషులతో పాటు స్త్రీలు కూడా 
నేడు సమాజం లో అన్ని రంగాలలో 
ప్రజా ప్రతినిధులుగా దేశ అధ్యక్ష ప్రధానమంత్రి స్థానాలలో కూడా 
సమానంగా పనిచేయడం.
 
పిల్లల పెంపకంలో స్త్రీ పురుషులు ఇరువురు పాలు పంచుకోవడం 
ఎన్నని ఏమని చెప్పను 
మార్పు అన్నది హర్షణీయమే
ఈర్ష్య అసూయ లేక అనురాగ ఆప్యాయతలు కలిగి 
ప్రజలంతా పరమేశ్వర స్వరూపులని 
కలసి మెలసి సమాజ అభివృద్ధికి తోడ్పడిన.
మంచి మార్పు ప్రగతికి సోపానమే..!
............................

కామెంట్‌లు