భళ్ళున తెల్లారగానే ఎండ చళ్ళున చెంపను తాకితే, కళ్ళు తెరచి గడియారంలోని ముళ్ళని చూసి చెంగున మంచం దిగిన పెరుమాళ్ళు బావిలో నీళ్ళు తోడుకుని పళ్ళు తోముకుని లోపలికి వస్తూ... తన తాతయ్య మావుళ్ళయ్య ఖళ్ళు ఖళ్ళున దగ్గడం విని ఆయన గదిలోకి వెళ్ళి "కాస్త కషాయం ఇస్తాను త్రాగు , దగ్గు తగ్గుతుంది "అని వంటింట్లోకి వెళ్ళి కషాయం నీళ్ళు మరిగించి మావుళ్ళయ్యకి ఇచ్చి, ఉతికిన గళ్ళ చొక్కా వేసుకుని కాళ్ళకి జోళ్ళు తొడుక్కుని పొలంకి బయలుదేరాడు. కళ్ళంలో ఉన్న ధాన్యం పాలేళ్ళతో బస్తాలలో నింపిస్తూ... ఎండకి గొంతు తడి ఆరిపోతూ ఉంటే కొబ్బరి బొండం నీళ్ళు త్రాగి, ఎడ్ల బళ్ళ మీద బస్తాలు వేయించి ఇంటికి వస్తూ...దారిలో గుళ్ళో ఉన్న దేవుళ్ళకి అరటి పళ్ళు సమర్పించి, ధాన్యానికి మంచి ధర పలకాలని విన్నవించుకుని,ఇంటికి వెళుతూ...పళ్ళంరాజు కొట్లో జీళ్ళు, పెప్పరమెంటు బిళ్ళలు ఇంకా చిరుతిళ్ళు కొనుక్కుని, ఇంటికెళ్ళి కాళ్ళు కడుక్కుని, గంప క్రింద ఉన్న కోళ్ళకి దాణా వేశాక తన ముద్దుల కూతురిని ఒళ్ళో కూర్చోపెట్టుకుని బళ్ళో చెప్పిన పాఠాల గురించి అడిగాడు. పెళ్ళాం అన్నానికి రమ్మని పిలిస్తే వెళ్ళి కూర్చున్నాక, తను పళ్ళెంతో అన్నం తెచ్చి కంచంలో వడ్డిస్తే తిని చేతులు కడుక్కుని వెళ్ళి నడుం వాల్చి, పెళ్ళాం చాలా ఏళ్ళగా అడుగుతున్న నెమళ్ళంచు పట్టుచీర, బంగారు రాళ్ళ జడబిళ్ళ చేయించాలని ఆలోచిస్తూ కళ్ళు మూసుకుని పడుకున్నాడు.
###################################

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి