కవి సామ్రాట్ విశ్వనాథకు అక్షరాంజలులు:-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్.- (పుష్యమి)-సెయింట్ లూయిస్- అమెరికా.


వాక్కులో   వాక్యంలో 
శబ్దంలో    సమాసంలో
భావంలో   భావనలో 
దర్శనలో.  విమర్శనలో 
భాషలో  భాషణంలో
కావ్య, కథ, శతక నాటక 
నవలా రచయితగా 
తెలుగు సాహితీ జగత్తు
దశా దిశా మార్చి వసుదైకానికే చాటిన 
కవి సామ్రాట్ పురస్కారనికే వన్నెతెచ్చిన 
విశ్వనాథ సత్యనారాయణ గారు 
సరస్వతీ మాత మానస పుత్రులే.

తిరుపతి వేంకటకవులలో ఒకరైన  గురువు చెల్లపిళ్ళ వేంకటశాస్త్రి గారిచే కీర్తింపబడి
మహాకవి శ్రీ శ్రీ చే మాట్లాడే వెన్నుముక అని 
సాహితీ మూర్తి సి.వి సుబ్రహ్మణ్యం గారిచే
ఆధునిక ఆంధ్ర సాహితీ ప్రపంచంలో విశ్వ విరాట్ మూర్తి అని 
ప్రవచన చక్రవర్తి ఉషశ్రీ చే 
ఆధునిక వాల్మీకి యని 
కీర్తింప బడిన మహనీయులు విశ్వనాథ.

అర్ధనారీశ్వరత్వానికి ప్రతీకగా 
భార్య వరలక్ష్మి వియోగంచే 
మీరు ఆమె పై వ్రాసిన వరలక్ష్మి త్రిశతి ఎందరికో ప్రేరణ.
మీరు వ్రాసిన వేయిపడగలు నవలను
బహు భాషా కోవిదుడు పూర్వ ప్రధాని భారతరత్న  పి వి.నరసింహారావు గారు హిందీభాషలో సహస్రఫణిగా అనువదించుట  తన జీవితాన మరువలేనిదనడం  
మీ కిచ్చిన సముచిత స్థానం.
మీరు వ్రాసిన శ్రీమద్రామాయణ కల్పవృక్షం జ్ఞానపీఠ పురస్కారం పొందటం 
మరో జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి. నారాయణ రెడ్డి
మీరు వ్రాసిన ఏకవీర నవల సినిమాకు 
పాటలు వ్రాయడం తన అదృష్టమనడం
మీ ఔన్నత్యానికి నిదర్శనం .

కళాప్రపూర్ణ,పద్మభూషణ్,జ్ఞానపీఠం పురస్కారాలకే వన్నెతెచ్చిన 
కవి సామ్రాట్ 
విశ్వనాథ సత్యనారాయణ గారు 
మీ కివే సపర్పిస్తున్న నా అక్షరాంజలులు...!!
...............................

కామెంట్‌లు