అపరిచితులు: - తమిళ రచయిత — ఇంద్రన్ రాజేంద్రన్-అనుసృజన - యామిజాల జగదీశ్


 చిన్నప్పుడు అమ్మ చెప్పేది…
“తెలియని వాళ్లతో మాట్లాడకూడదు.” “నీ పేరు చెప్పకూడదు.” 
“ఇంటి చిరునామా చెప్పకూడదు.” “మిఠాయి ఇస్తే తీసుకోకూడదు.” “పిలిచినా సరే, వాళ్ల వెంట వెళ్లకూడదు.”
నేను కూడా భయంగా తల ఊపేవాడిని.
స్కూలుకు వెళ్లాను. పక్క బెంచీలో కూర్చున్నవాడు అపరిచితుడే. మాటలు కలిశాయి. చివరికి ప్రాణస్నేహితుడయ్యాడు.
కాలేజీకి వెళ్లాను. గేటు దగ్గర కనిపించిన వాళ్లంతా అపరిచితులే. కలిసి టీ తాగాం. స్నేహితులయ్యారు.
ఉద్యోగంలో చేరాను. మొదటిరోజు చూసిన ముఖాలన్నీ అపరిచితాలే.
ఇప్పుడు వాళ్లే నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు పంపుతున్నారు.
అపరిచితులతో మాట్లాడకూడదని చెబుతూనే, మన జీవితమంతా అపరిచితులనే స్నేహితులుగా మార్చుకుంటూ వస్తున్నాం.
కామెంట్‌లు