లాలి పోసుకుని పాలు తాగితివి...
నును వెచ్చని అమ్మ ఒడిలో
అమ్మతో ఆటలు ఆడు ఆడు చుంటివి...
ఆద మరచి హాయిగా నిదుర పోవమ్మా...!
ఆనంద మంత , ఇపుడే అనుభ వించేయి...
వయసు పెరిగే కొద్ది అగచాట్లు ఎన్నెన్నో...!!
ఈ బంగారు బాల్యము
దేవుడిచ్చిన వరము...
మిగతా జీవితము మన కర్మ ఫలము...!
సుఖములో... బాధలో తెలియవే తల్లి...
చీ కూ చింతా లేనిదే
ఈ బాల్య మమ్మా...!!
*****

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి