ప్రగతికి దారి దీపం!
సుగతికి మోక్ష దీపం!
ప్రకృతికి రక్షా దీపం!
నింగిని సాగే అద్భుత దీపం!
రంగుల దారి సాగే దీపం!
బంగరు కాంతులు చిందే దీపం!
పొంగే ఆనందం పంచే దీపం!
కనకకలశంలో వెలిగే దీపం
దిక్కులన్నీ వెలిగించు దీపం
చుక్కలకు వెలుగిచ్చే దీపం
మొక్కిన చాలు వరమిచ్చే దీపం!
పుడమికి పచ్చను అలదే దీపం!
గిరులకు పుత్తడి పూసే దీపం!
సృష్టిలో మొదట వెలిగిన దీపం!
కష్టం తగలక కాచే దీపం!
మబ్బుల నీటిని నింపే దీపం!
వర్షం భూమికి అందించే దీపం!
సస్యం పండే ఆధార దీపం!
ప్రాణుల ఆకలి తీర్చే దీపం!
అరుణోదయాన ప్రభవించే దీపం!
అణువణువునా వ్యాప్త దీపమ్!
అందరి మనసుల ఆశా దీపం!
అపరంజి వెలుగుల దైవ రూపం!
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి