మతం ఉద్భవించాక మనిషి జన్మించాడా?
మానవత్వం కన్నా మతం గొప్పదా?
మానవత్వాన్ని నిలిపే సాధనం కాదా మతం?
మనిషిలోని దైవాన్ని వెతికే మార్గం కాదా అది?
కులాల కుమ్ములాటలతో,
మతాల మౌఢ్య భావాలతో,
మానవ సమాజం ముక్కలైతే
ఐకమత్యపు రాగం వినిపిస్తుందా?
విశ్వశాంతి గానానికి భువి వేదిక కాగలదా?
కులం పేరుతో... మతం పేరుతో...
విభేదాలను పెంచుకుంటూ,
విద్వేషాలను రగిలించుకుంటూ,
అశాంతి జీవితాన్ని గడపడానికేనా
మహోన్నతమైన ఈ మానవ జన్మ ఎత్తింది?
ఆలోచించాలి అంతరంగాన అందరం,
మనలాంటి వారే అందరని యోచించి,
సౌహార్ద్ర భావనతో మెలగాలి...
మానవత్వమును మించిన మతం లేదని
లోకానికి చాటిచెప్పాలి!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి