మనిషిఅత్యాశే తన జీవనయానంగాఉన్న స్థితినుండి ఉన్నత స్థితికి చేరుకోవాలనే తపనకుదురుగా ఉండనివ్వని మనసుసాటి మనిషితో తనను తాను పోల్చుకొనితను దిగువ నున్నానన్న దిగులుతోముందు విపత్తులను ఊహించలేకదోపిడికై తెగబడ్డాడుదొరకనంతకాలం దొరలాదొరికాక దొంగలాతప్పుడు మార్గమే ప్రగతికి మూలమనుకొనిఇక మాయికత్వమే ఏకైక లక్ష్యంగా బ్రతుకుతూ కటకటాల పాలవుతున్నాడుకూడు, గూడు, గుడ్డ ,విద్య ,వైద్యం ప్రాథమిక అవసరాలకైపంచభూతాలను చెరబట్టితాను విశేష ప్రగతిని సాధించాను అని ప్రగల్భాలు పలుకుతున్నాడుతనకుఅన్నీ తెలుసనుకొని తనకు ఏమితెలియని వెర్రివాడుభూతల్లి రత్నగర్భపొదుగులోని పాలు ఒక్కరోజే సొంతం చేసుకోవాలనే దురాశతో పొదుగునే కోస్తున్న వైనంమొదటికే మోసంకూర్చున్న కొమ్మను నరుక్కుంటున్న అవివేకంతో..వంద దాటితే వల్లకాడే నివాస స్థలమన్న విషయం మరచిన ధనమధాంథుడుఅహంకారులుజీవన్ముక్తైపరితపించండిదోపిడి సొమ్మేది మీవెంటరాదుఉన్నదంతా పరులకుపంచండిపుణ్య సంపద పెంచుకోండిరేపు నువ్వు కాలధర్మం చెందిననీవు నీపుణ్య చరిత్ర స్ఫూర్తిగా నిలుస్తుందినీ పుట్టుకెప్పుడో నీకు తెలియదునీమరణమెప్పుడో నువ్వు తెలుసుకోలేవుఅయినామితిమీరిన ఆపేక్షతోఆకాశహర్మ్యాలు నిర్మిస్తున్నానని విర్రవీగకూభూతల్లిని సహజవనరులకై అణువణువునా గాలించితివిభూకంపాలకు కారణభూతుడవైతివిజలప్రళయాలుప్రచండ గాలులుఅకాల వర్షాలుత్సునామీలునీచర్యల ఫలితమేనన్న విషయం తెలుసుకోవైతివినీముందుతరానికిస్వచ్ఛత లోపించిన పర్యావరణాన్ని బహుమానంగా ఇవ్వకునిజమైన ప్రగతి ,పురోభివృద్ధి అంటేపంచభూతాలను కలుషితం చేయకుండా కాపాడుతూనీ(మీ)ఆరోగ్య సంపద పెంచుకొనిఆయురారోగ్యాలతో వర్థిల్లడమేబ్రతుకు బ్రతుక నివ్వు అనే మూల సూత్రమాధారంగాభూతలాన్ని స్వర్గధామం చేయికానీకాలుష్యకాసారం చేయకుఅంతుచిక్కని సవాల్లకు కారణం కాకు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి