విశాలమైన అతని నీడ సముద్రములో
దట్టమైనమేఘమువలె విరాజిల్లుచుండెను
సముద్రంలో నీడ ఓడవలే ఒప్పారెను
అతివేగముగా పయనించుచున్న
హనుమంతునిచూచి దేవతలు
ఆయనపై పుష్ప వర్షము కురిపించిరి
ఆయనకు సూర్యుడూ, సహకరించెను
సాగరుడు మారుతికి సహకరించుటకై
సముద్రములో దాగిన మైనకను
సముద్రము నుండి పైకి రమ్మని పిలిచెను
రామకార్యమునకు సహాయపడుమనెను
హనుమ చీకటిలో పయనించినప్పుడు
మైన గిరి కాంతులను విరాజిల్లుచుండెను
హనుమంతుడు దానిని చూచి
ఇది యొక అటంకమని తలంచెను
మిక్కిలి వేగముతో ఆ కపీశ్వరుడు
వాయువేగముతో ఆ పర్వతమును
తమ వక్షస్థలముతో పడదోసెను
ఆ పర్వతము అతని చూచి సంతోషించెను

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి