1వ సర్గ : (4 ) : - ఎడ్ల లక్ష్మి


సంచరించుచూ అవి దేవతల మీద పడునని 
భయముతో దేవేంద్రుడు నా రెక్కలు నరుకుటకై 
నా వద్దకు వచ్చుచుండగా వాయుదేవుడు చూచి 
నన్ను సముద్రమున పడవేసెను 

ఓ కపివరా! వాయుదేవుడు నాకు మిక్కిలి పూజ్యుడు 
ఓ కపీశ్వరా! నీవు నిండు మనసుతో 
సముద్రునకును నాకును ప్రీతి గూర్చుము 
నీ దర్శనము వలన సంతోషించుచుంటిని 

మైనాకుని మాటలు వినిన పిమ్మట హనుమంతుడు 
ఆ గిరినితో ఇట్లు పలికెను 
మీ ఆదరవచనములకు తృప్తి చెందితిని 
ఆతిథ్యమును స్వీకరించినట్లే భావింపుము

కార్యసమయము మించిపోవుచున్నది 
మిత్రుల వద్ద ప్రతిజ్ఞ చేసేయుంటిని 
మార్గమధ్యమున ఆగుటకు వీలు లేదని 
హనుమ వేగముగా ముందుకు సాగెను

హనుమంతుడు అలుపు అనేది ఎరుగక 
సాగరముపై ఆకాశమున పయనించుచున్నాడు
అప్పుడు దేవతలు అతని పరీక్షించుటకై 
నాగమాతయగు సురసా దేవితో ఇట్లు నుడివిరి
కామెంట్‌లు