హనుమంతునికి అడ్డుగా వెళ్ళుమని తెలిపిరి
అప్పుడు ఆమె రాక్షసరూపము దాల్చి
హనుమంతునికి అడ్డు వచ్చి ఇట్లనేను
ఓ వానరేశ్వర! దేవతలు నిన్ను నాకు
ఆహారముగా నిర్ణయించి పంపిరి
ఇప్పుడు నిన్ను నేను భక్షించెదను
నా నోటిలోకి నీవిప్పుడే ప్రవేశింపుము
హనుమంతుడు చేతులు జోడించి ఆమెతో ఇట్లనెను
రామకార్యమునకై నేను వెళుచున్నాను
నీవు ఆయన లోకములోనే యున్నావు
అందుకనీ ఈ కార్యమునకు సహాయపడుము
ఓ హనమా! నాకు చాలా ఆకలిగా యున్నది
ఇప్పుడే నీవు నా నోటిలోకి ప్రవేశించుము
నన్ను మ్రింగదలిచినచో నీ నోరు తెరువుము
హనుమ మాటలు విని ఆమె నోరు తెరిచెను
అప్పుడు అచ్చట హనుమంతుడు
పది యోజనముల ఎత్తునకు పెరిగేను
ఆమె నోరునుఇరువై యోజనములకు పెంచెను
హనుమంతుడు అది చూచి క్రోధుడాయెను

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి