1వ సర్గ : ( 6 ): - ఎడ్ల లక్ష్మి


మారుతి వెంటనే ఆమె ముఖమున ప్రవేశించెను 
చిటికలో అతడు వెలుపలకు వచ్చెను 
ఓ దాక్షాయిణీ! నీకు నమస్కారము
ఇక సీతాదేవి కడకు వెళ్లెదను సెలవిమ్ము 

అప్పుడు దేవతలందరూ సంతోషించిరి 
హనుమంతుడు మేఘములను చీల్చుకొని 
ఆకాశమార్గమున వెళ్ళుచుండెను 
అప్పుడు అతనిని ఒక రాక్షసి చూచెను

ఆ రాక్షసి ఆయన ఛాయను ఒడిసిపట్టెను 
తన నీడ లాగుకొని పోవుచుండగా 
హనుమంతుడు ఇట్లు తలపోసెను 
నా పరాక్రమము కుంటుపడుచున్నది 

హనుమంతుడు క్రింద, పైన పరిశీలించెను 
సముద్రము నుండి మహా సత్యమును గాంచెను 
అప్పుడు హనుమంతుడు తన శరీరమును పెంచెను 
అ రాక్షసి గర్జించుచు మారుతిపై విజృంభించెను 

నోరు తెరుచుకొని హనుమ వద్దకు వచ్చెను 
సూక్ష్మ రూపంలో అతడు నోటిలో దూరేను 
పొట్టలోకి పోయి తన గోళ్ళతో చీల్చివేసి
వేగముగా ఆకాశము పైకి ఎగిరిపోయేను
కామెంట్‌లు