ఓ వానరోత్తమా! ఈ కార్యమును సాధింపుము
గట్టి ధైర్యంతో ముందుకు సాగుము
అని వారు అనుమతము నుడివి పంపిరి
అతడు నూరు యోజనముల మేరకు
సముద్రమును లంఘించిన పిదప చెట్లను గాంచెను
లంకకు దక్షిణముననున్న మలయ పర్వతమును
ఉప వనములను అతడు చూచెను
ఆకాశము వలే యున్న నా పెద్ద శరీరమును చూచి
ఆ రాక్షసులందరూ సంతోషించెదరని
పర్వతముతో సమానంగా శరీరమును పెంచెను
మరలా సూక్ష్మ రూపంలోకి మారెను
హనుమంతుడు అచట శికరములన్నియు తిరిగెను
సముద్రతీరము చేరి లంక అందమును చూచెను
కొబ్బరి చెట్లతో నిండియున్న శిఖరముపై దిగెను
ఆ శిఖరం పై నుండి లంకాపురమును గాంచెను
పర్వతం పై ఉన్న లంకాపురమును చూచెను
పూర్వ రూపమును విడిచి ఆ గిరి పై దిగెను
తన పరాక్రమముతో జలతీరమున దిగి
లంక నగరమును చూచుచుండెను.
======================================
సుందరకాండము నందు 7వ సర్గ సమాప్తము🙏🏻

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి