ప్రవాస పద్య పరిమళం - 138: - - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA
నేటి అంశము: న్యస్తాక్షరి
అక్షరములు: స్కందషష్ఠి
విషయము: కార్తికేయ జననము.
ఛందము. శార్దూలమ

న్యస్తాక్షరి… 1-6 ,/2-5,/3-15,/4-14.
1 వ పాదము - 6 వ అక్షరము  - స్కం
2 వ పాదము - 5 వ  అక్షరము -  ద 
3 వ పాదము - 15 వ  అక్షరము - ష
4 వ పాదము - 14 వ అక్షరము  - ష్ఠి



శార్దూలము:

ఆర్తత్రాణుడు (స్కం)దషష్ఠి దినమందా రెల్లు లో బుట్టి తా 
మూర్తిత్వమ్ము(ద)యింప షణ్ముఖుని గా ముల్లోకముల్ మెచ్చగన్
మార్తాండోదయ కాంతులన్ వెలుగుచున్ సంతో(ష) ముల్ పంచగా 
స్ఫూర్తిన్ బొందెను లోకమెల్ల మురుగా! పు(ష్ఠి)న్ ప్రమోదంబునన్

రెల్లు = రెల్లు పొద, శరవణ 

కామెంట్‌లు