శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ :- భాగం - 223
 
వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
201. సద్గతిప్రదా (పంచాక్షరీ)
202. సర్వేశ్వరీ (చతురక్షరీ)
రెండు వందల రెండవ నామ మంత్రము:
ఓం సర్వేశ్వర్యై నమః
సర్వేశ్వరీ = సర్వమునకు / సర్వులకు ఈశ్వరి అయినది
అన్ని లోకాలపైన ప్రభుత తనదేనని, సకల దేవతలను వారి వారి స్థానాలలో స్థిరంగా కూర్చుండబెట్టినది తానే, అని తెలుపుతూ ప్రకటితమైన పరాత్పరిని చూసి వశిన్యాది వాగ్దేవతలు అమ్మను, "సర్వేశ్వరీ" అని కీర్తించారు. మనకు ధర్మబద్ధంగా రావలసిన దానిని అడుగకముందే ప్రసాదించే అమృతవల్లికి నమస్కారము.
సకల చరాచర జగత్తు సృష్టి జరుగకముందే, అన్ని శక్తులను తనలో ఉంచుకున్నది, శ్రీమాత. సృష్టి రచనకు ప్రణాళిక రచించి, బ్రహ్మ ద్వారా సృష్టి కార్యాన్ని, విష్ణువు ద్వారా పాలన జరిగేలా చూస్తూ, శంభుని ద్వారా లయంను పూర్తి చేస్తున్నది, శ్రీమాత. మానవుల గ్రహ గతులను చక్కగా ఉండవలసిన స్థానంలో ఉండడానికి, సూర్యుడు, చంద్రుడు మొదలైన తొమ్మిది గ్రహాలనూ వారి ప్రదేశంలో కూర్చుండ చేసినది, పరాత్పరి. ఈ లోకపాలురందరూ తమ తమ కార్యాలను సరిగ్గా చేసేటట్టుగా చూసుకుంటున్న శ్రీమన్నగర నాయకి, "సర్వేశ్వరీ" అయ్యింది.
ప్రకృతిలో ఉన్న పంచభూతాలు, గాలి వీచడానికి, ఆకాశము పైనే ఉండడానికి, నీరు నిరంతరమూ ప్రవహిస్తూ ఉండడానికి, నిప్పు తన దహన శక్తిని ఉంచుకోడానికి, భూమి కుంగి పోకుండా ఉండడానికి లలితా పరాభట్టారికయే కారణము. పంటలు పండించడానికి, ఈ ఋతువులు మారడానికి, ప్రకృతి వైపరీత్యాల ప్రభావం ఎక్కువగా ఉండకుండా చూసేది కూడా నారాయణవల్లభయే. తన సృష్టిలో ఉన్న జీవులందరికీ సకల సుఖాలను ఇవ్వగలిగినది,  శ్రీమహారాజ్ఞి అయిన "సర్వేశ్వరీ"యే.
మనందరకు ఎటువంటి లోపాలు జరగకుండా, గ్రహగతులను స్థిరపరుస్తూ మనలను కాచేది తానే అని తనను పూజించి కొలిచే, తన భక్తులను, సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న  శ్రీమాతను పూజించేటప్పుడు   ఓం సర్వేశ్వర్యై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయవశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....

...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
కామెంట్‌లు