మానవ రూపమును ధరించి
తన శిఖరముపై నిలిచి పైనుండి వెళ్తున్న
కపివీరుని సమీపించి ఇట్లనెను
ఓ వానరోత్తమా! నీవు అలిసిపోతివేమో?
నా శిఖర ప్రదేశముల యందు నిలిచి
హాయిగా కొంత కాలము విశ్రమింపుము
జలది రఘువంశాజులచే వృద్ధి చెందినది
రామకార్యముకై సిద్దపడిన నీకు
సాగరుడు
అతిథిసపర్యలు చేయదలచినాడు
అతడు ఇచ్చేటి ఆతిథ్యమును
నీవు స్వీకరించినచో అతనికి సంతోషము
ఓ హనుమా! మేము నిన్ను పూజించినచో
వాయుదేవుని పూజించినట్లే
అందుకని నీవు నాకు పూజ్యుడవు
కొంతసేపు నాపై విశ్రమించుము
ఓ పూజ్యుడా! పూర్వకాలము
పర్వతమునకు రెక్కలు ఉండేడివి
అవి గరుడవేగముతో అన్ని దిక్కులకు
హాయిగా సంచరించుచుండెవి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి