అగ్నిసాక్షిగా రామసుగ్రీవులు మిత్రులగుట - తన అన్న వాలిని వధింపుమని సుగ్రీవుడు
శ్రీరాముని వేడుకొనుట. ప్రభువు వానరేంద్రునకు అభయమిచ్చుట
రామలక్ష్మణులు ఇచ్చటికి విచ్చేసినారు
శ్రీరాముడు మహావీరుడు ప్రజ్ఞాశాలి
అతడు దశరథ మహారాజు పుత్రుడు.
తండ్రి ఆజ్ఞను పాటించుటకై వనవాసమునందు
నివసించుచుండగా ఆయన భార్యను
రావణుడు అపహరించుకునిపోయెను
అందుకని మీ సహాయము కొరకై వచ్చినాడు.
సోదరులైన ఆ రామలక్ష్మణులు
నీతో మైత్రిని చేయ గోరుచున్నారు
హనుమ మాటలు విని సుగ్రీవుడు సంతోషించెను
వానర రాజైన సుగ్రీవుడు వారిని దర్శించెను.
శ్రీరాముని సమీపించి సుగ్రీవుడు ఇట్లనెను
"ఓ పూజ్యుడా! నీవు గొప్ప పరాక్రమశాలివి
సమస్త ప్రాణులపై దయ చూపే వాడవు
నీ గుణముల గూర్చి వాయుపుత్రుడు తెలిపెను
" ఓ ప్రభూ! నీవంటి మహాత్ముడు వానరుడైన
నాతో మైత్రి గోరుట, మీ చేతితో నా చేతిని కలుపుడు
నాకు మిగుల సంతోషముగా ఉన్నది రామా!
అప్పుడు శ్రీరాముడు అతనిని కౌగిలించుకొనెను.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి