6వ సర్గ : - ఎడ్ల లక్ష్మి
సీతాపహరణ వృత్తాంతమును హనుమంతుని ద్వారా వినియుంటిని 
- ఆ దేవి జాడ తెలుసుకొని ఆమెను తీసుకొని వచ్చి 
నీకు అప్పగించెదను అని సుగ్రీవుడు శ్రీరామునకు మాట ఇచ్చుట. 




సంతోషపరుడైన సుగ్రీవుడు శ్రీరామునితో ఇట్లనెను
ఓ రామా! హనుమంతుడు నాతోడుగా ఉంటాడు 
సీతాదేవి అపహరణ గూర్చి అతడు నాతో తెలిపెను 
జటాయువు గూర్చి కూడా అతడే తెలిపినాడు 

ఓ రఘువీరా! పాతాళమునగాని, ఆకాశమున గాని 
ఎచ్చటయున్నా గాని నీ భార్యను తెచ్చి నీకప్పగించెదను
ఓ రఘునందనా! నిజముగా నా మాటలు నమ్ముము 
సీతాదేవి, క్షేమముగా నీవద్థకు చేరును రామా! 

ఓ మహాబహూ! ఒకరోజు క్రూరాత్నుడైన రాక్షసుడు 
ఒక స్త్రీని తీసుకొని పోవుచుండగా నేను చూచితిని 
నా ఊహప్రకారము ఆమె సీతాదేవియై ఉంటుంది 
ఆమె రామా! రామా! లక్ష్మణా! లక్ష్మణా అని ఏడ్చుచుండెను. 

అప్పుడు నేను నా నలుగురు మంత్రులతో గూడి
ఈ కొండపై నుండగా ఆమె నన్ను చూచి తన కొంగు చింపి 
ఆమె నగలను మూటగట్టి ఇచ్చట జారవిడిచెను 
ఆ నగలమూటను నేను భద్రముగా ఉంచితిని. 

రామా! ఆ మూటను నేను తీసుకొని వచ్చెదను 
ఓ రఘునందన వాటిని చూసి గుర్తుపట్టగలవు 
శ్రీరాముడు సుగ్రీవుని మాటలు విని మిత్రమా! 
నీవు ఆలస్యము చేయక తీసుకొనిరమ్ము అని పలికేను.

కామెంట్‌లు