సుగ్రీవుడు తన సంకట పరిస్థితిని గూర్చి శ్రీరామునకు వివరించుట
పొంగిపోయి అతనితో ఇట్లు నుడువు చుండెను
ఓ స్వామీ! మీ అండ ఉన్నచో ఇక భయము లేదు
రామా! నా బాధగూర్చి నీకు తెలిపెదను వినుము.
ఓరామలక్ష్మణులారా మీరు నిలబడే ఉన్నారా అని
సుగ్రీవుడు పూలు, పండ్లతో ఉన్న మద్దికొమ్మను తెచ్చి
వారిరువురికి ఆసనముగా అమర్చెను
అతడు కూడా అచ్చటనే ఆసీనుడైనాడు
రామా! మా అన్నయైన వాలి నా భార్యను
తీసుకపోయి నన్ను అవమానించెను
అతడు నన్ను కిష్కింద నుండి గెంటివేసి
నాతో వైరమునకు పూనికొని బద్ధ శత్రువు అయ్యెను
ఓ రఘువరా! వాలినుండి నన్ను కాపాడుము
సుగ్రీవుడు ప్రాధేయపడుచు శ్రీరాముని వేడుకొనెను
ఓ వానరశ్రేష్టా! నీ శత్రువైన నీ అన్న వాలి
నా శరములతో పర్వతము వలె నేలకొరుగును
సుగ్రీవుడు రాముని మాటలకు సంతోషించెను
ఓ రామా! నీవు అగ్నిసాక్షిగా మిత్రుడవైతివి
నీవు నాప్రాణమిత్రుడవన్న విశ్వాసముతో
నాలోని బాధను నీతో విన్నవించుకున్నాను

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి