9వ సర్గ : ఎడ్ల లక్ష్మి
వాలితో తనకు వైరమేర్పడిన రీతిని సుగ్రీవుడు, శ్రీరామునకు తెలుపుట 




మా అన్నయగు వాలి శత్రువులను 
సంహరించుటలో గొప్ప దక్షుడు
మా తండ్రియగు ఋక్షరాజునకు వాలి అనిన 
మిక్కిలి ప్రేమ నాకు కూడా అంతే ప్రేమ 

మా తండ్రి గతించిన పిదప జేష్ఠుడగటచే
అతనిని ఏకగ్రీవముగా వానర రాజ్యమునకు 
ప్రభువును గావించిరి నేను సేవకునిగా ఉంటిని 
అప్పుడు అన్న వాలి నన్ను ప్రేమగా జూచెను

 "ఓ రామా! వాలి గూర్చి తెలుపెద వినుము 
మాయావి అనే రాక్షసునకు మా అన్న వాలికి 
ఒక స్త్రీ వలన వైరము నేర్పడి
శత్రువులుగా మారిరి
ఆ శత్రుత్వంతో రాక్షసుడు  పగ తీర్చుకొనుటకై

ఒక మధ్యరాత్రి ,మాయావి గట్టిగా అరుస్తూ 
కిష్కింద ద్వారము కడకు చేరెను 
ఆ ధ్వని వినిన వాలి కోపముతో నిద్రలేచి  
వెలుపలకు వచ్చెను నేను గూడ వెళ్ళితిని 

వాడు మమ్ములను జూచి
పారిపోవుచుండెను 
మేము గూడా అతనిని వెంబడించితిమి 
ఆ రాక్షసుడు ఒక భిలములో దూరేను 
వెంటనే వాలిగూడా అందులోకి వెళ్లెను
కామెంట్‌లు