దివ్యమైన దీపావళి
అందరం జరుపుకునే
ఆనందమైన దీపావళి !
దీపావళి దీపావళి
అధర్మాన్ని ఓడించి
ధర్మాన్ని గెలిపించిన
ధవళ కాంతి దీపావళి !
దీపావళి దీపావళి
ప్రమిదల దీపావళి
పడుతులు ముగ్గేసే
పరవశించు దీపావళి !
దీపావళి ఈ దీపావళి
తెలుగువారి దీపావళి
తేరుపైన తానొస్తున్నది
తెలుగుదనం తెస్తున్నది
దీపావళి మన దీపావళి
ఆగమేఘాలపై వస్తున్నది
ఆ నరకాసురుని వధించిన
మన సత్యభామ దీపావళి !
ఆ నరకాసురుని వధవల్ల
వచ్చాను మన దీపావళి మల్ల
సచ్చెను ఆ తిమిరావళి పిల్ల
మెచ్చెను ఇక ముల్లోకాలెల్ల !

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి