పిఠాపురం, : ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచడం ద్వారానే భూగ్రహాన్ని కాపాడుకోవచ్చుని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా పీఠం నూతన ఆశ్రమంలో కార్తీక పౌర్ణమి మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా మాధురి విద్యాసంస్థల అధినేత, గొల్లప్రోలు మున్సిపల్ చైర్మన్ కడారి తమ్మయ్యనాయుడు, పిఠాపురం మున్సిపల్ చైర్మన్ దానం లాజర్ బాబు ఆయన సతీమణి కమలా రాణి, జనసేన నాయకుడు మార్నిడి రంగబాబు, పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.వి.వి.సత్యనారాయణ, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సెక్రెటరీ కె.శివకుమార్ విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొంది తరించారు. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కార్యక్రమాల్లో భాగంగా ఉమర్ ఆలీషా కుట్టు శిక్షణ కేంద్రానికి జిగ్ జాగ్ మిషన్, క్లాత్ కటింగ్ టేబుల్ బహుకరించారు. పీఠం సభ్యుడు అనారోగ్యం గురికావడంవల్ల ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరపున రూ.10 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. పీఠం మరియు ట్రస్ట్ లో వాలంటీర్లుగా పనిచేస్తున్న యువతి యువకులకు డ్రెస్ లను అందజేశారు. సభకు విచ్చేసిన అతిధులకు, సెంట్రల్ కమిటీ సభ్యులు మరియు వాలంటీర్లకు ధాన్యపు కుచ్చులను అందజేశారు. పేద మహిళలకు 22 దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్తీకమాస సభకు నూతనంగా 90 మందికి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి మహా మంత్రోపదేశం చేశారు. కార్తీక పౌర్ణమి సభ సందర్భంగా రాజమహేంద్రవరం స్పెషల్ పోలీస్ బెటాలియన్ కమాండెంట్, కళారత్న డాక్టర్ కొండ నరసింహారావు ఆయన సతీమణి అలివేలు మంగాదేవి సభా ప్రాంగణంలో పూరించిన అఖండ శంఖారావం సభికులను మంత్రముగ్ధులను చేసింది. తాత్విక బాలవికాస్ విద్యార్థిని విద్యార్థులు చేసిన ప్రసంగాలు సభికులను అలరింపజేశాయి. తాత్విక బాల వికాస్ లో విద్యార్థిగా చేరి ఎన్నో ప్రసంగాలు చేసిన యువకుడు, అవధాని యర్రంశెట్టి ఉమామహేశ్వరరావు పీఠం విశిష్టతను సభికులకు వివరించారు. అదే విధంగా ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ చేస్తున్నటువంటి కార్యక్రమాలను డాక్టర్ పద్మావతి విచ్చేసిన సభ్యులకు వివరించారు. ఈ మహాసభకు విచ్చేసిన సభ్యులకు ఉచిత భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. సభలో రెడ్ క్రాస్ మరియు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో సుమారు 50 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మంత్ర, జ్ఞాన, ధ్యాన అనే త్రయీ సాధన చేయాలని, త్రయీ సాధన చేయడం ద్వారా భుక్తి, తృప్తి, ముక్తి ప్రసాదించి, మానవుడి యొక్క జీవితానికి సార్దాక్యత లభించును అని డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి వారు అనుగ్రహ భాషణ చేసారు. కార్తీక పౌర్ణమి సభకు విచ్చేసిన వేలాది సభ్యులందరికీ కార్తీక పౌర్ణమి విశిష్టతను తెలియజేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒక ధృడ నిర్ణయం తీసుకుని పీఠం అవలంబిస్తున్న 'నా మొక్క - నా శ్వాస' అనే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మూడు మొక్కలను నాటి వాటి సంరక్షణకు బాధ్యత తీసుకోవాలని డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, హైదరాబాద్ ఆశ్రమ మీడియా కన్వీనర్ డాక్టర్ సునీల్ కుమార్ యాండ్ర, సెంట్రల్ కమిటీ సభ్యులు డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్, ఏ.వి.వి.సత్యనారాయణ, ఎన్టీవీ ప్రసాద్ వర్మ తదితరులు పాల్గొన్నారు.
మొక్కలు పెంచడం ద్వారానే భూగ్రహాన్ని కాపాడుకోవచ్చు : - పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి