కాకినాడ, : స్థానిక 53వ వార్డులో ఏర్పాటు చేసిన సమావేశంలో డా చిట్ల కిరణ్ మాట్లాడుతూ తాను 53వ వార్డులో నామినేషన్ వేసిన తర్వాత కూటమి పార్టీల సీట్ల సర్దుబాటులో భాగంగా తన వార్డుని భారతీయ జనతా పార్టీకి కేటాయించడం వలన నేను ఆ పార్టీ అభ్యర్థి అయిన లక్ష్మి ప్రసన్నకి తన సంపూర్ణ మద్దతు ప్రకటించి, ఆవిడ మరియు కూటమి అభ్యర్థుల విజయానికి సహకరిస్తున్నాననని, ప్రజలంతా మన కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నామినేషన్ ల ఉపసంహరణ రోజున తాను అత్యవసర శస్త్ర చికిత్సలో ఉండటం వలన తన నామినేషన్ ఉపసంహరణ చేయలేక పోయాను అని, అయినా తన సంపూర్ణ మద్దతు తెలుపుతూ కాకినాడ మేయర్ అభ్యర్థి ఆకుల భవానీ మరియు కూటమి అభ్యర్థుల విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానని పత్రికా ముఖంగా తెలియజేస్తున్నానని అన్నారు.
తన శ్వాస ఉన్నంత వరకూ తాను జనసైనికుడినేనని, జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు సదా కృషి చేస్తానని డా చిట్ల కిరణ్ తెలిపారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి