జీవితంలో శ్రీకృష్ణుడి బుద్ధి, శ్రీరాముడి సహనం మనకు అలవడితే… మనల్ని గుర్తించేది పరిస్థితులు కాదు, మన సంస్కారం, వ్యక్తిత్వం.
శ్రీకృష్ణుడి నుంచి తెలివిగా ఆలోచించడం నేర్చుకుంటే... శ్రీరాముడి నుంచి ఓర్పుగా ఉండటం నేర్చుకుంటే...
జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు బలమే పరిష్కారం కాదని శ్రీకృష్ణుడు మనకు నేర్పించాడు. కొన్ని సమస్యలకు తెలివి కావాలి, మరికొన్నింటికి మంచి ఆలోచన కావాలి. ఇంకొన్ని సందర్భాల్లో సరైన సమయం కోసం ఎదురుచూడాలి.
పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా ధర్మాన్ని, సత్యాన్ని, మర్యాదను విడిచిపెట్టకూడదని శ్రీరాముడు మనకు చూపించాడు.
శ్రీకృష్ణుడి జీవిత ప్రయాణం మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది.
ఎదురుగా కష్టాలు వచ్చినప్పుడు భయపడకూడదు. ఆలోచనతో వాటిని ఎదుర్కొనే మార్గం వెతకాలి.
శ్రీరాముడి జీవితం మరో విషయాన్ని చెబుతుంది.
దారి ఎంత కష్టంగా ఉన్నా సహనాన్ని కోల్పోకూడదు.
ఈ రెండు గొప్ప పాఠాలను మన జీవితంలో పాటిస్తే… మనం ఎంత గొప్ప వ్యక్తులుగా మారగలమో ఒక్కసారి ఆలోచించండి!
కృష్ణుడి నుంచి నేర్చుకోవాల్సింది: ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి.
రాముడి నుంచి నేర్చుకోవాల్సింది: మౌనంగా ఉంటూనే మన సిద్ధాంతాలకు కట్టుబడి ఎలా ఉండాలి.
కృష్ణుడి నుంచి నేర్చుకోవాల్సింది: పరిస్థితులకు తగ్గట్టుగా మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవడం.
రాముడి నుంచి నేర్చుకోవాల్సింది: పరిస్థితులు మారినా మన వ్యక్తిత్వాన్ని మార్చుకోకపోవడం.
కృష్ణుడి నుంచి నేర్చుకోవాల్సింది: కష్టాల్లో తెలివిని ఉపయోగించడం.
రాముడి నుంచి నేర్చుకోవాల్సింది: కష్టాల్లో సహనాన్ని పాటించడం.
జీవితం ఎప్పుడూ ఒకే దారిలో సాగదని శ్రీకృష్ణుడు మనకు అర్థమయ్యేలా చెప్పాడు. కొన్ని సందర్భాల్లో తెలివిగా ఆలోచించి, మంచి మార్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.
దారి ఎంత కష్టంగా ఉన్నా మర్యాదను, ధర్మాన్ని వదిలి గమ్యాన్ని చేరడం నిజమైన విజయం కాదని శ్రీరాముడు తన జీవితంతో నిరూపించాడు.
అందుకే శ్రీకృష్ణుడు మనకు జీవితాన్ని ఎలా నడిపించాలో నేర్పిస్తే, శ్రీరాముడు మన వ్యక్తిత్వం ఎలా ఉండాలో నేర్పిస్తాడు.
రాముడి మర్యాద లేని కృష్ణుడి తెలివి అసంపూర్ణం.
వివేకం తోడుకాని రాముడి సహనం కూడా కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో సరిపోదు.
ఈ రెండూ కలిసినప్పుడే మనలో పుట్టేవి…
* వివేకంతో ఆలోచించే మనసు,
* సహనంతో నిండిన హృదయం,
* గట్టి వ్యక్తిత్వం,
* మంచి పనులు చేసే స్వభావం.
ఈరోజు మన సమాజానికి కావాల్సింది కూడా ఇలాంటి సమతుల్యతే.
శ్రీకృష్ణుడిలా తెలివిగా ఆలోచించే యువత కావాలి. కానీ ఆ తెలివిని మోసం చేయడానికి కాదు, అందరి మేలు కోసం ఉపయోగించాలి.
శ్రీరాముడిలా సహనంతో ఉండే మనుషులు కావాలి. కానీ సహనం అంటే బలహీనత కాదు. సరైన సమయం వచ్చే వరకు సత్యం కోసం నిలబడటమే నిజమైన సహనం అని అర్థం చేసుకోవాలి.
ఎందుకంటే…
బుద్ధి ఏం చేయాలో చెబుతుంది.
సహనం ఎప్పుడు చేయాలో చెబుతుంది.
వ్యక్తిత్వం ఎందుకు చేయాలో చెబుతుంది.
మన పనులే ఎలాంటి ఫలితం వస్తుందో నిర్ణయిస్తాయి.
శ్రీకృష్ణుడు మనకు చెప్పే సందేశం…
“నీ కర్తవ్యాన్ని నెరవేర్చు. పరిస్థితులను అర్థం చేసుకో. వివేకంతో ముందుకు సాగు.”
శ్రీరాముడు మనకు ఇచ్చే సందేశం…
“ధర్మం ఆచరించడం కష్టంగా ఉండవచ్చు. కానీ ధర్మ మార్గాన్ని వదిలేయడం పరిష్కారం కాదు.”
ఈ తరం యువత ఈ ఇద్దరి బోధనలను గుడిలో పూజించడానికే పరిమితం చేయకుండా, తమ నడవడికలో ఆచరిస్తే కుటుంబాల్లో నమ్మకం పెరుగుతుంది. సమాజంలో మానవత్వం పెరుగుతుంది. దేశంలో మంచి వ్యక్తిత్వం కలిగిన మనుషులు పెరుగుతారు.
అప్పుడు మనం కేవలం…
“రాముడు మనకు ఆదర్శం, కృష్ణుడు మన ఆరాధ్య దైవం”
అని చెప్పుకోవడమే కాదు.
మన జీవితమే ఆ మాటలకు నిదర్శనంగా నిలుస్తుంది.
రాముడి మర్యాద మన ప్రవర్తనలో కనిపించాలి.
కృష్ణుడి తెలివి మన నిర్ణయాల్లో కనిపించాలి.
కృష్ణుడి చతురత, రాముడి సహనం…
కృష్ణుడి నీతి, రాముడి మర్యాద…
కృష్ణుడి కర్మ సందేశం, రాముడి కర్తవ్య నిష్ఠ…
ఈ గొప్ప లక్షణాలన్నీ మన జీవితంలో భాగమైతే ఒక్క మన జీవితం మాత్రమే కాదు…
మన ఇళ్లు మారతాయి.
మన కుటుంబాల్లో సంస్కారాలు పెరుగుతాయి.
మన సమాజం మారుతుంది.
రాబోయే తరాలకు మంచి మార్గం చూపించగలుగుతాం.
ఎందుకంటే గొప్ప సమాజాలు కేవలం పెద్ద పెద్ద భవనాలతో నిర్మితం కావు.
గొప్ప ఆలోచనలు, మంచి సంస్కారాలు, ఉత్తమ వ్యక్తిత్వం కలిగిన మనుషులతో నిర్మితమవుతాయి.
కాబట్టి ఈరోజు నుంచే ఒక సంకల్పం తీసుకుందాం…
కృష్ణుడి నుంచి బుద్ధిని తీసుకుందాం.
రాముడి నుంచి సహనాన్ని నేర్చుకుందాం.
కృష్ణుడి నుంచి నీతిని నేర్చుకుందాం.
రాముడి నుంచి మర్యాదను అలవర్చుకుందాం.
కృష్ణుడి నుంచి కర్మ సందేశాన్ని స్వీకరిద్దాం.
రాముడి నుంచి కర్తవ్య నిష్ఠను నేర్చుకుందాం.
ఈ ఇద్దరు మహానుభావుల బోధనలను మన జీవితంలో ఆచరిస్తూ…
మన వంతుగా ఒక కొత్త చరిత్రను సృష్టిద్దాం!
శ్రీకృష్ణుడి బుద్ధి, శ్రీరాముడి సహనం మన జీవితంలో ఉంటే…: - - యామిజాల జగదీశ్
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి