మనీ నేను "మనీషి"నిప్పుడు: - డా సి వసుంధర చెన్నై


 మని/మనిషి/మనీషి
చిత్రమైన పదం
మని 
కి. "షి" 
చేర్చగా మనిషి 
డబ్బుకు. దాసుడు
మనిలో  ని  కి పొల్లు పెడితే" మనీషి"
అతడే జ్ఞానానికి దాసుడు.
ఎంతమార్పు! అదే తెలుగుభాష కున్న చాతుర్యం
తెలుగువాళ్లు తెలుసుకోవాలి అమూల్య పదజాలం
 
 మనం మనుషులం బ్రతికించేది 
మనల్ని మనీయే 
కాదనను 
"ధనమూల మిదంజగత్". కానీ ధనమే మన జగత్ కాదని తెలుసుకోవాలి
మనిషి
 
లక్ష్మీని సంపాదించు నీ కుక్షి నింపుకొని లక్షణంగా బ్రతకడానికి దానిని దాచి 
పాచిపట్టిన నీటిలా వృథా మాత్రం చెయ్యకు
పదుగురికి
పంచు ఉంచు నీ పేరు అందరి నాల్కలపైనా 
అమృత బాండం 
లా
మనిషి మనీ తోనే 
అన్నీ సాధించలే
డు కానీ
మంచితనంతో ఎన్నో సాధించవచ్చు
 అందుకే పెంచుకో మంచి
త్రుంచుకో 
మనీపై వ్యామోహం
ఉంచుకో నీతోనే శాంతి ప్రేమ దయ
దాన కరుణాది 
ధనాలు దండిగా
 ఆ ధనాలే నిన్ను ఆదుకొనే ఆదరించే అద్భుత వరాలని 
న్న మాట ఒంట 
పట్టించుకో
 పట్టి ఉంచకు పాడు లోభత్వాన్ని
వీడు ధనాపేక్ష
ధన్యుడవుకమ్ము
కామెంట్‌లు