గంగాతీరం : - అచ్యుతునిరాజ్యశ్రీ


 తల్లి కుంతిమాటలకు తల్లడిల్లిన పాండవులు వారందరికీ ప్రదక్షిణప్రణామాలు చేశారు. గాంధారి,ధృతరాష్ట్రులు ఎంత నచ్చజెప్పినా కుంతి ససేమిరా అంది.ధృతరాష్ట్రుడు తన పరివారంతో  గంగాతీరం చేరాడు.అక్కడ అగ్నివెల్గించి ఆహుతులు అర్పించాడు. ఆపై దర్భశయ్యపై  ముగ్గురూ శయనించారు. దగ్గరలోనే  విదురాదులు పడుకున్నారు. తెల్లారాక  అగ్నిహోత్రంచేసి ఉత్తరదిశగా బైలుదేరారు.ఉపవాసంతో  భాగీరథి తీరంలో జనాలని కలిశాడు.ఆపై కురుక్షేత్రంచేరారంతా!అక్కడ  రాజర్షి శతయూపుని కలిశారు.కేకయదేశపురాజైన అతను కొడుకుకి రాజ్యభారం అప్పగించి  అడవికొచ్చాడు.అతనితో కల్సి ధృతరాష్ట్రుడు వ్యాసుని కల్సి ఆయన నుండి వనవాసదీక్షతీసుకుని  తపస్సు ప్రారంభించాడు.గాంధారి,కుంతీ కూడా నారలు మృగచర్మాలు ధరించి కఠోర తపస్సులో మునిగారు.ధృతరాష్ట్రుడు ఎముకల పోగులా జడలుకట్టిన జుట్టుతో ఉన్నాడు.విదురుడు సంజయుడు వల్కలాలు ధరించి ఘోర తపస్సులో మునిగారు.🌹
కామెంట్‌లు