ముందుగానే సిద్ధమవుతాం..
అనుకున్నట్లుగానే నెగ్గుతాం
కొన్నిసార్లు ఓడిపోతాం ఓడిపోయిన వాళ్లు
ఒక అవకాశం కోసం వేచి చూస్తారు.
నిజానికి పరీక్షల్లో నెగ్గడం కోసం పరీక్షలోని ప్రశ్నలకు
సమాధానాలు రాయడం కోసం మాత్రమే సిద్ధమవుతాం
కానీ ఆ పరీక్షల్లోని ప్రశ్న పత్రం
తయారు చేయడం కోసం మాత్రమే మనం సిద్ధమవ్వాలి.
అంటే ప్రశ్నలకు సమాధానం కాదు మనం ఇవ్వాల్సింది
ప్రశ్న పత్రాన్నే మనం తయారు చేయగలగాలి.
సరిగ్గా అలాగే పరీక్షలోని ప్రశ్నకు సమాధానం కాదు
మనం ఇవ్వాల్సింది మరొకరికి అది బోధించడం కోసం
మనం ఎలా సిద్ధమవాలో నేర్చుకోవాలి..!!?
అప్పుడే మనం నిజ జీవిత పరీక్షల్లో నెగ్గుతాం........!!!?
==============================================
డా ప్రతాప్ కౌటిళ్యా.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి