అవసరం ఏమిటి? కోరిక ఏమిటి?: - - యామిజాల జగదీశ్


 చాలామంది, అవసరమైనంత డబ్బు కూడబెట్టి, ఆ తర్వాతే మంచి జీవితం గడపాలని అనుకుంటారు.
ఎందుకంటే, అవసరానికి హద్దు ఎక్కడ ఉందో వారికి తెలియదు...
వారు చివరిదాకా డబ్బు కూడబెడుతుంటారు.
తమ కోరికను తీర్చుకోకుండా...
జీవితాన్ని జీవించకుండానే..!
ఇదే చివరిసారి అవసరమవుతుందనుకుంటూ పరుగెత్తుతారు, పని చేస్తారు...
తమ చివరిసారి ఎప్పుడో తెలుసుకోకుండా..!
కనుక ఏదైనా కోరుకున్నప్పుడు...
అది పొందాక సంతోషంగా ఉండేలా ముందే చూసుకోవాలి..!
కామెంట్‌లు