నక్షత్రపతి!: - :పాలగుమ్మి జ్యోతి.

 

ప్రక్రియ: రుబాయిలు( తిశ్రగతి )


పాలబువ్వ తినిపిస్తూ చూపించెడి చందమామ! 
పున్నమిలో పూర్ణముగా కనిపించెడి చందమామ! 
సిరులతల్లి సోదరునిగ పేరొందిన అందగాడు!
అంబరమున తారలతో శోభించెడి చందమామ!!  

మహేశ్వరుని శిరముపైన మెరయునట్టి  సుధాకరుడు! 
వెన్నెలతో విరహాగ్నిని రేపునట్టి సుధాకరుడు!
అమావాస్య నిశీధిలో అదృశ్యమగు తన రూపము! 
కలువరాణి  మదిని దోచి మురుయునట్టి  సుధాకరుడు!!

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Beautiful 👌👌