ఎక్కువైపోయారు...!: - కొత్త విరిత


 ఒకప్పుడు పెద్దలు చెప్పేవారు, బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం, మంచి జీతం, హాయిగా సెటిల్ అవ్వొచ్చని. మనమూ నమ్మి జీవితంలో సగం చదువుకే అంకితం చేశాం!
చదువుకోలేనివాళ్లు వ్యవసాయం, చేతివృత్తులు చేసుకుంటూ బతికేవాళ్లు. వాళ్లను తక్కువగా చూసి, మన డిగ్రీలను గొప్పగా భావించాం.
కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది! డిగ్రీలు మన చేతుల్లో ఉన్నాయి, ఉద్యోగాలు మాత్రం ఎ ఐ చేతుల్లోకి వెళ్తున్నాయి!
మనిషి పదేళ్లు నేర్చుకున్న పనిని  ఎ ఐ నిమిషాల్లో చేస్తోంది. మన రెజ్యూమ్‌లను కూడా మనకంటే బాగా తయారు చేస్తోంది!ఇంటర్వ్యూలో మనిషిని సెలెక్ట్ చేయడానికి వాడుతున్న  ఎ ఐ, రేపు రిజెక్ట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుందేమో!
ఇన్నాళ్లూ చదువుకోమన్న సమాజం, ఇప్పుడు  ఎ ఐ నేర్చుకోమంటోంది. రేపు ఎఐ ని కూడా మించిపోతే ఇంకెవరిని నేర్చుకోమంటారో!
ఒకప్పుడు శారీరక శ్రమ చేసేవాళ్లను చిన్నచూపు చూశాం. ఇప్పుడు కంప్యూటర్ ఉద్యోగాలకే గ్యారంటీ లేకుండా పోతోంది.చేతిపని చేసేవాళ్లకు కనీసం తమ నైపుణ్యం మీద నమ్మకముంది!ఒకప్పుడు పల్లెల నుంచి పట్టణాలకు వలస వెళ్లాం. ఇప్పుడు  ఎఐ తో పోటీ పడలేక మళ్లీ పల్లెల్లో ప్రశాంతత కోసం వెతుకుతున్నాం.
చదువుకున్నవాళ్లు  ఎఐ కి ఉద్యోగాలు ఇచ్చి, తాము వ్యవసాయం చేసుకుంటే... దాన్ని నిరుద్యోగం అంటామా? ఆధునిక స్వయం ఉపాధి అంటామా?ఒకప్పుడు మనిషి యంత్రాలను నడిపించాడు. ఇప్పుడు యంత్రాలు మనిషి భవిష్యత్తును నడిపిస్తున్నాయి.
రాబోయే తరానికి ఉద్యోగాలు దొరుకుతాయో, ఎ ఐ తో కలిసి బతకడం నేర్చుకోవాలో కాలమే చెప్పాలి!
కానీ ఎఐ అనేది మనిషి సృష్టించిన సాంకేతికత మాత్రమే. దానికి దిశానిర్దేశం లేదా అప్రూవ్ చేయాల్సింది మనిషే!డిగ్రీలకంటే నైపుణ్యానికి, ఉద్యోగాలకంటే సృజనాత్మకతకు, హోదాలకంటే మానవత్వానికి విలువ పెరగాలి.
ఎందుకంటే...  ఎఐ ప్రపంచాన్ని ఎంత వేగంగా నడిపించినా, ఆ ప్రపంచానికి అర్థం ఇచ్చేది మాత్రం మనిషే!
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
True excellent write up