సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 

 సామెత -426: ఉపాయాలున్నోడు ఊరి మీద బతుకుతడు
**
"అవ్వా! నువ్వేమన్న అను.గీ సద్వు తెల్వి తేటలు, వొయ్యిలు సద్విన గ్యానం, గిదంత ఎందుకు కొరగాదవ్వా! గియ్యన్నింటి తల్కాయదన్ని ఇంకోటి సుత ఉంది.అస్లు గదుంటే సాలు ఏడనైన బిందాస్ గ బత్కొచ్చు.
"ఏంది శెల్లోవ్!; ఎన్నల్లేంది గియ్యాల గమ్మతిగ మాట్లాడుతున్నవ్? సుఖంగ కాల్మీద కాలేస్కొని బత్కాలనే కోర్కె బలేగ పుట్టింది.గింతకి ఎవల్ని సూశి నువ్వట్లంటున్నవ్?"
 ఎవ్వల్ని సూత్తేందవ్వా? మన బత్కు తీరు ఏవఁన్న మారిందా?పొద్దత్తమానం శాకిరి శాకిరీ.గానిగెద్దులెక్క ఇంట్లింట్లెనే పొద్దంత తిర్గుడు తప్పనిడిశి బత్కుల ఏవన్న తేడా గొట్టుడుందా శెప్పు? గింత జేసినా పొట్టకి బట్టకి ఎల్తున్నది గని పది పైసలు ఎన్కేసుడుందా శెప్పు?"
"ఆపతికో సాపతికో ఎవ్వల్నన్న పది రూపాయిలు అడ్గితే మనవేఁదో సంపన్న సావుకార్లమైనట్టు గట్ల అడగబడ్తిరని ఆచ్చిర బోవుడే గని, యిచ్చే తందుకు ఎవలన్న ముందుకొత్తరా శెప్పవ్వా?"
"అగ్గో! గిప్పుడు సమజైంది గని  మాటల్తో బులిపిచ్చుడు నీకు నాకు వొత్తదా శెల్లే! ఏదైన కుండ పలగ్గొట్టినట్టు మాట్లాడ్తం. కొంత మందిరిని సూత్తన్న గద నోటితో మాట్లాడ్తనే నొసటితో ఎక్కిరిత్తుంటరు."కంట్లె కారపేలు పెట్కుంట నోట్లె బెల్లపేలు" పెడ్తుంటరు."
 " నువ్వన్న మాట నిజ్జంగా నిజం అవ్వా! మనదేమో అంత ముక్కు సూటి యవ్వారమేనాయె. కాత్త ఒడుపు,జెరంత ఉపాయం మన తాన ఏడివి శెప్పు.గందుకే మనం కదలని శెర్వు నీళ్ళ లెక్క గట్లనే ఉన్నం.గాల్లు వొరదల్లెక్క ఆత్తిపాత్తులు అన్నిట్ల ఉర్కులు బెడుతుర్రు."
"గా దుర్గయ్య మావఁని సూశినవు కద.కట్టు బట్టల్తోని,శేతిల శిల్లిగవ్వ లేకుండ, తల్కాయ మీదు కండ్వగుడ్డ ఏస్కుని గీ వూరు వొచ్చిండు. గిప్పుడు సూడు ఉన్నూరోల్లకి సుత గంతిల్వ లేదు. గా దుర్గయ్య లేకుండ ఏవఁన్న పంచన్లూ, పనులూ జరుగంగ సూశినవా?"
 "వోశోష్! గిదంత శెప్పింది,శివరాకరికి తెల్సుకుంది గా సంగయ్య ముచ్చెటినా?"
 "గా మావఁ  మస్తు ఉపాయం గల్లోడు శెల్లే !ఎవలి తాన ఎట్ల మెలగాల్నో మాగా తెల్శినోడు. గస్మంటోళ్ళని సూశే మన పెద్దోళ్ళు "ఉపాయాలున్నోడు - ఊరి మీద బతుకుతడు"అన్న శాత్రం పుట్టించిర్రు.మాటలు శెప్పి బండరాయి మీద నూకలు పుట్టిచ్చే రకం. ఎస్మంటోడు ఎంత స్థాయికి వొచ్చిండో సూడు మరి."
"గదండీ సంగతి! "ఉపాయాలున్నోడు ఊరి మీద బతుకుడు"  అంటే గిదే మరి. కాకులు దూరని కారడవి శీమలు దూరని శిట్టడివిల సుత బత్కు సక్కంగ ఎల్లదీయ గల్గుతడు. "
కామెంట్‌లు