పిల్లలు -గురువులు: - దుడుగు నాగలత -సిద్దిపేట


 కం.
బుడిబుడి యడుగులు వేయుచు
బడితోటన విరియుచున్న బాలలకెపుడున్
కడు యాటలునేర్పిన వెం
బడిబడి యాడును మురియుచు బడికే వచ్చున్ .
కం.
తరములు మార్చెడి గురువుల
నిరతము పూజింపవలెను నియమము తోడన్
తరగతి గదులే బాలల
తరగని నిధులగును జూడ ధరణినియెపుడున్
కామెంట్‌లు