పయనించే ఓ మనిషి నీ యుక్తా యుక్త విచక్షణతో
ప్రణాళిక బద్దంగా
కర్తవ్యాన్ని నెరవేర్చుకో .
గతించిన కాలం తిరిగి రాదు అని తెలుసుకు
బాల్యంలో ఆప్యాయతలతో ఆటపాటలతో గడచిన కాలం
చదువుతోబాటు సంస్కారం కలిగే
ఈర్ష్య అసూయలు లేక
చిరునవ్వు ఎన్ని అవరోధాలు ఎదురైనా వదలక
లక్ష్యం వైపు
జీవిత ప్రయాణాన్ని సాగిస్తే
అనుకున్నది సాధించి మానవ జన్మను సార్ధకత చేసుకో
సమాజంలో జరిగే సంఘటనలను చూసి
జీవితాన్ని మలచుకో
కాలమనే ప్రవాహంలో ఎందరో మనుషులు దూరమయ్యారు
జాతస్యహి ధ్రువో మృత్యు: అని
గడిచిన కాలం తిరిగి రాదని
రాబోయే కాలం ఎలా ఉంటామో అని
నేడు చేయవలసిన పని తప్పక చేసే మానవుని జీవితం ధన్యమే...!!
.............................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి