ఒక్కసారి ఆలోచించండి...మంజుల పత్తిపాటి .
\

హాస్పిటళ్లు నగరాలకేనా...?
వైద్యం పట్నాలకేనా...?
దారి లేని పల్లె గుడిసెల్లో
దీపాల్లా వెలిగి... రెప్పపాటులో ఆరిపోతున్న
నిండు ప్రాణాలకు దిక్కెవ్వరు...
ప్రచారపు వెలుగులు పంచడం కాదు...
పల్లె గుడిసెల్లో జీవితాలకు వెలుగులు నింపండి...!

మన పూర్వ కాలంలో  పచ్చని చెట్లు సెలయేరులతో 
ఆనందాన్ని  పంచిన ప్రకృతి
నేడు కన్నెర్ర చేయడానికి కారణంఎవరు...?
ఒక్కసారి ఆలోచించండి...!

గుప్పెడు మెతుకుల కోసం
గుండెను పిండే ఆకలితో...
ఎండిన డొక్కలతో బతుకును ఈడ్చే
బతుకు జీవులకు బతుకుబాట చూపకుండా...
చిరిగిన చేతిలో కొంచం బువ్వ పెట్టి,
 సెల్ఫీలు దిగి  పత్రికా పుటల్లో ప్రచార పర్వం 
సాగిస్తున్నారు నేటి నాయకులు...
పేదవాడి పొయ్యి వెలగనంతవరకు
పాలనకు పరమార్థమేముంది...?

ఎండిన పంటను చూస్తే
రైతన్న గుండె రగులుతోంది...
చెమట చుక్కలతో పండించిన పంట 
రుధిరచుక్కలనే కురిపిస్తోంది...
అన్నదాత కన్నీరు ఆగనంతవరకు
అభివృద్ధి మాటలకు అర్థమేముంది...?
====================================
మంజుల పత్తిపాటి 
చరవాణి 9347042218 
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ రాష్ట్రం.
కామెంట్‌లు