భయం : - యామిజాల జగదీశ్

 

భయపెట్టినదొకటి 
లేకుండా పోయినప్పుడు 
మనసులో కలిగేదల్లా 
‘ఇక దేనికీ భయపడకూడదు’ అనే ధైర్యం.

జీవితం అలా ఉండనివ్వదని తెలిసినా, 
ఏదో ఒక రోజు 
చాలా తేలికైన మనసుతో 
ఎవరినైనా ప్రేమించాలనుంది

ఆ రోజు 
మీరు నా దగ్గర నుంచి 
ఏదైనా దొంగిలించినా 
నాకు కోపం రాదు

కామెంట్‌లు