ఆశ్రిమవాసికపర్వం అచ్యుతునిరాజ్యశ్రీ



 పాండవులు రాజ్యపాలన చేస్తూ పెదనాన్న పెత్తల్లి ఐన ధృతరాష్ట్ర గాంధారి లను  నెత్తినపెట్టి చూసుకోసాగారు. విదురుడు, సంజయుడు,యుగపురుషుడు ధృతరాష్ట్రుని కనిపెట్టుకుని ఉండేవారు.15ఏళ్లు పాండవులు వారిసేవచేశారు కిక్కురుమనకుండా!కుంతీ కూడా బావ తోడికోడలు సేవలో ఉండేది.ద్రౌపది సుభద్ర, ఇతరపాండవపత్నులు  అత్తల్ని పువ్వుల్లో పెట్టి చూసుకునేవారు.కృపాచార్య,వ్యాసుడు, విదురుడు అండగా నిలబడి ఓదార్చేవారు.ఇక వంటలో ఆరావికులు(ఆరా అనే పనిముట్టుతో ఆకుకూరలు తరగటంచేసేవారు)సూపకారులు(పప్పులు మొదలైనవి వండేవారు) రాగఖాండవికులు( పిప్పళ్ళు శొంఠి చక్కెరతో రసం చేసేవారు) రకరకాల వంటలతో తృప్తిగా వండివార్చేవారు.ఇక సుభద్ర, ఉలూపి,చిత్రాంగద మొదలైనవారంతా దాసీలకన్నా ఎక్కువగా వృద్ధదంపతులసేవచేశారు.ధృతరాష్ట్రుడు దానధర్మాలు చేస్తూ సుఖభోగాల్లో ఉంటున్నాడు.ఇప్పుడు ధృతరాష్ట్రుడు తన గతాన్ని తల్చుకు పశ్చాత్తాప పడసాగాడు.ఒక్క భీముడు మాత్రమేఅప్పుడప్పుడు  అప్రియమంగా మాట్లాడేవాడు.ఆవృద్ధదంపతులకు విన్పడేలా ఓరోజు ఇలా అన్నాడు" నాభుజబలం ఎంతో గొప్పది. ఈగుడ్డిరాజు కొడుకుల్ని యమపురికి పంపాను" అనగానే ధృతరాష్ట్రునికి దుఃఖం తన్నుకొచ్చింది.  ములుకుల్లాంటి అతని పలుకులకు ధృతరాష్ట్రుడు దుఃఖించాడు. గాంధారి కూడా ఆమాటలు వింది. అందుకే వారిద్దరూ అక్కడినుంచి అడవికి వెళ్లాలని నిశ్చయానికొచ్చారు🌹

కామెంట్‌లు