జాగ్రత్త.; - డాక్టర్ సి వసుంధర చెన్నై
 


"నాన్న అమ్మ కావాలి నాకు. అమ్మ కావాలి ఇప్పుడే కావాలి" ఏడుస్తూ చిన్న వాళ్ళ నాన్న వైపు చూశాడు. అనంద్ కొడుకును దగ్గరగా తీసుకొని "అమ్మ ఆఫీస్ పని మీద ఊరు వెళ్ళింది నాన్న తర్వాత వస్తుందిలే నువ్వు పడుకో "అన్నాడు "లేదు నాన్న నాకు ఇప్పుడే అమ్మ కావాలి" అన్నాడు చిన్న. ఆనంద్ ముఖం వాడిపోయింది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి" నా నాన్నవి కదూ పడుకో నీకు అసలే ఒళ్ళు బాగా లేదు రేపు తప్పకుండా రమ్మని  ఫోన్ చేస్తాను""నాన్న మాటలకు" అమ్మ ఏ ఊరు వెళ్ళింది నాన్న అమ్మ ఏక్కడికి వెళ్ళింది?  చిన్న ప్రశ్నకు తడబడుతూ ఢిల్లీకి అన్నాడు ఆనంద్. "మరి నన్ను ఇప్పుడే ఢిల్లీకి తీసుకొనిపో" అన్న కొడుకు మాటలకు ఆనందుకు ఎక్కడలేని కోపం వచ్చింది "ఢిల్లీకి పోతావా పో ఎక్కడికైనా పో నీ ఇష్టం" అంటూ గట్టిగా అరిచి  అటువైపు తిరిగి పడుకున్నాడు ఆనంద్ చిన్న మౌనంగా నాన్న తట్టే చూస్తూ "నువ్వు మంచి నాన్నవి కాదు. అమ్మ మంచిది. నన్ను ఎప్పుడు విసుక్కోదు. అందుకే నాకు అమ్మ కావాలి" అంటూ కోపంగా ఆనంద వైపు చూశాడు ఆనందు ఈ లోకంలో లేడు. కళ్ళు మూసుకుని పడుకున్నాడు
❤️❤️❤️❤️
తెలవారింది ఆనంద్ వంటింట్లో నుంచి "ఒరేయ్ చిన్న నిద్రలే బ్రష్ పేస్ట్ ఆక్కడుంది తోముకో కాఫీ తెస్తున్న" అంటూ చెప్పి కాఫీ తయారు చేయడంలో నిమగ్నమైనాడు చిన్న లేచిన చప్పుడు గానీ  చిన్న శబ్దం కూడా రాలేదు. ఆనందు ఏంటి వీడు ఇంకా లేవలేదా అనుకుంటూ మంచం దగ్గరకు వచ్చాడు చిన్న అటు తిరిగి పడుకోమన్నాడు. చిన్న చిన్న లే నాన్న అంటూ కొడుకు మీద చెయ్యి వేసాను ఆనంద్ ఎగిరిపడ్డాడు బాబు బాబు బాబు  అంటూ చిన్నను నేరుగా తిప్పాడు అమ్మ కోసం అనుమటైంచే చిన్న  నిర్జీవుడై ఉండడం  గమనించి "నాయనా చిన్న ఇంత పని చేసావ్ రా నీకు గుండె జబ్బు అని తెలిసి కూడా నిన్ను నిన్న రాత్రి ఎంతో విసుక్కున్నాను మీ అమ్మ మనల్ని విడిచి ఎప్పుడో స్వర్గానికి వెళ్ళిపోయిందిరా. నీకు చెప్పలేక నేను భరించలేక నేను  నిన్ను విసుకుఎన్నాను నాయనా నువ్వు అమ్మ మంచిదనుకొని అమ్మ కోసం కలవరించి అమ్మ దగ్గరికి వెళ్లి పోయావా పాపిష్టి వాడిని గుండె జబ్బు ఉన్న నిన్ను విసుక్కుని నీ ఉసురు తీశాను నాయనా" అంటూ మంచం దగ్గర కూలపొడి ఏడవడం మొదలుపెట్టాడు నాన్న నువ్వు మంచి వాడివి కాదు అన్నట్టు ఉన్న చిన్న మొహం చూసివాడిని ఒడిలోకి తీసుకుని ఒంటరిగా మిగిలిపోయాడు
నీతి
పిల్లలతో జాగ్రత్తగా మాట్లాడాలి వారికి సున్నితమైన మనసు మన విసుకులు వారి మీద విసరకూడదు దాని ఫలితం ఇలాగే ఉంటుంది
కామెంట్‌లు