ఒక విషయం మొదలైతే చాలు... దాని చుట్టూ చర్చలు మొదలైపోతాయి!
ఎవరో ఏదో అన్నారట...
ఇంకెవరో ఏదో చూశారట!
అసలు ఎవరు చెప్పారు అని అడిగితే మాత్రం సమాధానం ఒక్కటే... "విన్నాను!"
ఎక్కడ విన్నావంటే,గుర్తులేదు!
ఎవరి దగ్గర విన్నావంటే, పేరు చెప్పడం అంత మంచిది కాదు!
నిజానిజాలు తెలుసుకునే ఓపిక ఎవరికీ లేదు, చర్చించే ఉత్సాహం మాత్రం అందరికీ ఉంది!
ఒకరు చెప్పిన మాటకు మరొకరు మసాలా కలిపి ఇంకొకరికి అందిస్తారు!చివరకు అసలు విషయం పక్కకు పోయి, "కొత్త కథే" ప్రచారంలోకి వస్తుంది!
ఆధారాలు అడిగితే వ్యక్తిగత సమాచారం అంటారు!
నిజమా కాదా అంటే,"ఆ మనకెందుకు, ఏదో విన్నాం అంటారు!"
వినడంలో తప్పులేదు... కానీ విన్నదంతా నిజమని నమ్మడమే అసలు సమస్య!తెలియని విషయంపై మౌనంగా ఉండటం కంటే, తెలిసినట్టు మాట్లాడటమే గొప్పగా మారిపోయింది మరి.
చివరకు నిజం ఎక్కడుందో ఎవరికీ తెలియదు... కానీ "ఆ విన్నాను" మాత్రం ఊరంతా వినిపిస్తుంది!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి