సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం


 సామెత -424: ఉన్నోడు ఉన్నోడికే పెట్టె లేనోడు ఉన్నోడికే పెట్టె

**
"ఏందో అవ్వా! గీ పెపంచకంల మడుసులెవలూ అర్తం కారు తీ? శానా శిత్రంగ శేత్తుంటరు."
 "శెల్లే! అన్ననని ఏవఁనుకోకు గని గా మడుసుల్ల నూ లేవా ఏంది శెప్పు?"
"అవ్వా! నూ కారెడ్డం ఆడ్తున్నవ్. నాకు తెలుత్తనే వుంది గని నేనైతే గా మడుసుల్ల లేనవ్వా! నూ నమ్ము నమ్మక పో సత్తె పెమాణకంగ శెప్తన్న."
"శెల్లే! ఊకెనే వొల్లెక్కంగ అన్న.నీ యిష్యం నాకు తెల్వదా ఏంది? గింతకీ ఎవలి ముచ్చెటి. ఎవలు నీకు అర్తం కాట్లే ?గంత రంది వడ్తున్నవెందుకు శెల్లే?"
"గదేనవ్వా! మన సాయిత్రత్తోల్ల సంగతి తెల్సుగద! సచ్చినా కట్టెల బదలా కట్టల్తో తలగబెట్టేంత ఆత్తి. గాళ్ళ పిల్గానికి లగ్గం సేశేతందుకు సంవందాలు సూత్తుర్రు. గిప్పటి దన్క పదేను యిర్వై సంవందాలు సూశిర్రట గని..."
గా పిల్గానికి ఈడు జోడు,అందం సందంగల్ల పిల్ల దొర్కట్లేదా ఏంది? గీ నడ్మల పతొక్కలు అన్ని సక్కంగున్నా జాత్కాలు కల్సుడు లేదని సక్క సక్కని సంవందాలు వొదుల్కొనుడు సూత్తున్నా?గట్లేమన్న కుదుర్తలేవా ఏంది?"
 "నూ గిన్ని శెప్పినవ్ గద!గందుట్ల ఒక్కటంటే ఒక్కటి సుత కల్వలే. అస్లు యిష్యం ఏందో శెప్పనా? నేనైతే గట్ల శెయ్యలేదవ్వా. నీకు సుత తెల్సు."
 "మా పిలగాడికి సూశిన సంవందంల ఎక్కడా గా ముచ్చెటి రాలె.ఈడూ జోడూ,పిల్ల సద్వుకుందా? లేదా?గదే సూశినం.గయి మంచిగున్నంక ఎక్కడ అతి జెయ్యలే.
 "బోయినాల కాడ సుత,ఇంట్లె జేస్కున్నట్టు వో పప్పు,యిగురు కూర, గోంగూర తొక్కు,తియ్య పప్పు, పచ్చి పులుసు,గోలిచ్చినపిండి వొడియాలు,వో లడ్డు,వో మడుగు పెట్టినం. మీరంతరూ గింత సాదా సీదా సక్కని, కమ్మని బోయినాలు గీ నడ్మల ఎవలు పెట్టట్లేదని, మంచిగ పెట్టిర్రని మమ్మల్ని మెచ్చుకుర్రు గద.యాడాది తిరక్క మున్పే గప్పుడే యాది మర్శినవా అవ్వా!"
"గట్లెట్ల మరుత్త శెల్లే!నూ,మా మర్ది  శానా మంచి మన్సున్నోళ్ళు. పైసా కట్నం దీస్కోకుండ,పేదింటి పిల్లని లగ్గం జేస్కుర్రు.బోయినాల కానించి పతొక్క కర్సు మీరే బెట్కున్నరని గయ్యాల వొచ్చినోళ్ళంత మస్తు మెచ్చుకుర్రు గద శెల్లే! గిప్పట్కీ గా యిష్యం తల్సుకుంటె శానా సంబురంగన్పిత్తది."
గందులేముందిలే అవ్వా! వొకలికి శెప్పేతప్పుడు మనం సుత గట్ల లేకుంటే ఏవఁన్న మంచిగుంటదా?అబ్బో! మా శెప్పొచ్చినవ్ తీ అంటరా అనరా అవ్వా! గింతకీ నే శెప్పాలన్కుంది అర్తమైంది గదవ్వా!"
 " నూ గా సాయిత్రిత్తోల్ల ముచ్చెటి శెప్పినవ్.గాల్ల యవ్వారం సూత్తె గాల్లందే యియ్యానికి సముజ్జి గావాలె. గట్లనే గా సుబ్బమ్మత్త ముచ్చెటేంది శెప్పు. గాల్లకి శానా సంవందాలల్ల పిలగాడు సదువరి,పెద్దుజ్జోగం శేత్తున్నా ఎన్కాల ఆత్తిపాత్తులు లెవ్వని వొదుల్కుంట వొత్తుర్రు.పిలగాడు బుద్ధివంతుడా,శెడ్డ అల్వాట్లు లేకుంటుండా? రేప్పొద్దుగాల పిల్లని సక్కగ సాదుకుంటడా లేడాని సూస్కోవాలె గని,గీల్ల సర్దీటి గుండాలనుకోవుడు ఎందుకు శెప్పు?"
 "శెల్లే!పురాగ పై యిష్యాలు సూత్తుంటే "ఉన్నోడు ఉన్నోడికే పెట్టె- లేనోడు ఉన్నోడికే పెట్టె" అన్న శాత్రం యాదికొత్తుంది గదా!  శెల్లే! అందరూ నీ లెక్క నా లెక్క యిశారిత్తే ఎంత మంచిగుండేది.గీ పెపంచకంల అందరూ సమానంగుండేటోళ్ళు."
 "అవునవ్వా! నువ్వన్న మాట అచ్చర సత్తెం".
"గదండీ సంగతి!"ఉన్నోడు ఉన్నోడికే పెట్టె- లేనోడు ఉన్నోడికే పెట్టె" అంటే గిదే మరి. మీకు సుత సమజైంది గదురుల్లా!"
కామెంట్‌లు