శివార్చన - సర్వ శుభప్రదం : - ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ - (పుష్యమి)- హైదరాబాద్


సృష్టి స్థితి లయకారపులైన త్రిమూర్తులలో 
లయ కారకుడైన శివుడు అడిగిన వెంటనే 
కోరిన కోర్కెలు తీర్చే  బోళా శంకరుడు.
క్షీరసాగర మథనం ఉద్భవించిన గరళాన్ని 
లోక కళ్యాణార్థం స్వీకరించి  కంఠమునందు0చి 
ముల్లోకాలను కాపాడిన  ప్రాణ ప్రదాత నీలకంఠుడు.

పవిత్ర కార్తీక మాసంలో  సోమవారం, ఏకాదశి పౌర్ణమి నాడు 
మాఘ మాసంలో శివరాత్రి పర్వదినమున 
ఉపవాస జాగరణలతో
భక్తిశ్రద్ధలతో  రుద్ర సూక్తం లోని 
"నమః శంభవేచ మయోభవేచ 
నమః శంకరాయచ మయస్కరాయచ 
నమః శివాయాచ శివతరాయాచ" అని 
నారికేళ పంచామృతాలతో 
నమక చమకాలతో శివ మంత్రం పఠిస్తు
అభిషేక బిల్వార్చనలు 
శివలింగానికి చేసిన 
 జన్మరాహిత్యమన్నారు ఆది శంకరులు.
ఓం నమః శివాయ అను పంచాక్షరీ మంత్ర జపం 
అప మృత్యు నివారిణి 
భూలోక కైలాసాలైనా కాశీ, శ్రీశైలం లో 
శివరాత్రి కార్తీక మాసపు ఉత్సవాలు తిలకించిన చాలు సర్వ శుభప్రదం సంపత్కారకం...!!
.............................

కామెంట్‌లు