: రెండు ఊపిరితిత్తులు:- డా సి వసుంధర చెన్నై

 

స్వేచ్ఛ లేని బ్రతుకు స్వాతంత్రం లేని జీవనం 
సహరా ఎడారే
పై రెండు మనో
 సౌధానికి లోగిళ్ళు  
అవి లేని మనిషి జీవితం సంకెళ్ళే 

 స్వేచ్ఛ స్వాతంత్రాలు 
మనిషికి పుట్టుకతో
వచ్చిన హక్కులు
 
సమాజాభివృద్ధికి 
మానవోన్నతికి 
 అవి మానవునికి 
మహోన్నత శక్తి  సంపదలు 
 
రాజులఇంటి
భూషణం
 కాదు రాజ్యాంగం 
ప్రజల మనోభావాలకు
అది దర్పణం 
అదే ప్రజాస్వామ్య సిద్ధాంతసూత్రం 

బూజు పట్టిన నిరంకుశ రాజ్యపాలనను
దులిపి ప్రజాస్వామ్య కంఠం కీర్తించిన గొప్పకావ్యమది
 దానికి ఆది మాత్రం కొందరు ప్రాచీన రాజ్యాంగ నిపుణులే అది మనం స్మరించాలే
కానీ విస్మరించకూడదు 
కొందరినైనా జ్ఞప్తికి తెచ్చుకోకున్న
అసలైనరాజ్యాంగ రుచులు 
పచనానికి రావు 
మన రసన
కందవు 

శ్రీరామ,
బలి, హర్షవర్ధన, కృష్ణరాయ, అశోకాది మహా చక్రవర్తులు    
ఎందరోఅసలైన ప్రజాస్వామ్యాన్ని 
 రాజ్యాంగాన్ని మనకందించిన జాడలు అనేకం 

 కుల మత స్త్రీ పురుష వివక్షత కు తలుపులు మూసి,

ప్రజా హక్కుల పరిరక్షణకు
చలువ పందిరి 
వేసి 

ఒకదేశ జనుల
జీవన గతికి 
ప్రగతికి బాటలు,
ఏర్పరిచేది
రాజ్యాంగం 

కబంధహస్టాలనుండి దేశాన్ని కాపాడిన ఆధునిక అశోకులు నవ్య స్వర్ణయుగస్థాప కల్పనా చక్రవర్తులు 
 రాక్షస రాజ్యాలను రాజులను వీక్షణాలకు కూడా అందకుండా తరిమికొట్టిన 
బలమైన బలి చక్రవర్తులు ఎందరో 
వారందరి 
ఆలోచన పరిశ్రమతో 
శరీరశ్రమతో 
మన హస్తాలలో అరటిపండులా వచ్చింది 
నేటి రాజ్యాం కాని దానికి పునాది ఆది 
ఆ పైవారిదే

ఆధునిక భారతదేశ 
రాజ్యాంగ శిల్ప రూపకల్పనలో
శిల్పులు

1 డాక్టర్"బాబా సాహెబ్ అంబేద్కర్  "రాజ్యాంగ పితామహుడు"
గా కీలక సూత్రధారుడు 

2 డాక్టర్ రాజేంద్రప్రసాద్
3 జవహర్లాల్ నెహ్ర
4 బెనగల్ నర్సింగరావు (సలహాదారు విదేశాలలో తిరిగి రాజ్యాంగ రూపకల్పన చేసే విధానంలో మొదటి ముసాయిదా సమర్పించినవాడు ముఖ్యుడు)

5 సర్దార్ వల్లభాయ్ పటేల్ 
అన్నిటా  ఉక్కుమనిషి

6 కృష్ణస్వామి అయ్యర్

7 మహిళా మణులు సరోజినీనాయుడు విజయలక్ష్మి పండిట్
హన్సా మెహతా
దుర్గాబాయి దేశ్ముఖ్ 
అమృత కౌల్
ఇందరి
 ఉద్దండుల చేతి దండం 
మన రాజ్యాంగం 
దానిని దండగ మారిదానిగా
మార్చి తమ మెడలో పూలదండగా వేసుకుని తిరిగే నాయకులకు 
కనువిప్పు కలగాలి అసలైన ప్రజాస్వామ్యం రాజ్యాంగం  వచ్చే రాజ్యాంగ దినోత్సవానికైనా
జనాలకు   అందగలిగితే అప్పుడే ఆ పైవాళ్ళందరూ సంతోషిస్తారు ఇప్పుడు ఉండేవాళ్ళు బాగుపడతారు 
భారత జనావళి కి అప్పుడే అసలైన 
కార్తిక మాస దీపాల శోభావళి
🩸🩸🩸🩸

కామెంట్‌లు